
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని సోడాబాటిల్ ఓపెనర్ వాలా రెస్టరెంట్‌లో సోమవారం హలీమ్ – పలావ్ ఈటింగ్ పోటీలు నిర్వహించారు. ప్రత్యేక రంజాన్ మెనూతో ఏర్పాటు చేసిన ఈటింగ్ పోటీల్లో పెద్దసంఖ్యలో ఆశావాహులు పాల్గొన్నారు. 1.2 కేజీల హలీమ్ లాగించి భరత్ విజేతగా నిలవగా బాసిత్ అలీ రన్నరప్‌గా నిలిచాడు.
2.5 కేజీల పలావ్ ఆరగించి సౌమ్య ప్రకాష్ విజేతగా నిలవగా 1.5 కేజీల పలావ్ తిని అమిత్‌నాయర్ రన్నరప్‌గా నిలిచాడు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. గత రెండేళ్ల నుంచి ఈటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు సోడాబాటిల్ ఓపెనర్ వాలా రెస్టరెంట్ నిర్వాహకులు తెలిపారు.
పోటీలో పాల్గొన్న ఆశావహులు
Comments
Please login to add a commentAdd a comment