eating contest
-
వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా?
ఫుడ్ ఛాలెంజ్‌లో పాల్గొని విజయాలు సాధించినవారు కొందరైతే, మరికొందరేమో దీనిని చాలా సీరియస్‌గా తీసుకుని, గెలవాలనే తాపత్రయంలో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. సాధారణంగా ఎవరైనా ఒకటి లేదా రెండు బర్గర్లు తినగానే ఇక మావల్లకాదని చేతులెత్తేస్తారు! అలా కాదని బలవంతంగా ఎక్కిస్తే ఇక వాంతులే.. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి కేవలం 24 నిముషాల్లో ఎన్ని బర్గర్లు తిన్నాడో తెలిస్తే... ఖచ్చితంగా నోరెల్లబెడతారు. ఇంగ్లాండ్‌కు చెందిన కైలీ గిబ్సన్ (23) అనే వ్యక్తి ‘మెక్‌డోనల్డ్స్ క్రిస్టమస్ ఛాలెంజ్'లో పాల్గొని కేవలం 24 నిముషాల్లో ఏకంగా 6 బర్గర్లు లాగించేశాడు. పైగా ఇదంతా నాకు చాలా మామూలు విషయమని అంటున్నాడు కూడా. నిజానికి కైలీ గిబ్సన్ ప్రొఫెషనల్ ఈటర్. గత కొన్ని యేళ్లగా ప్రతిరోజూ లెక్కలేనన్ని లార్జ్ మీల్ ఈటింగ్ కాంపిటీషన్లలో పాల్గొంటున్నాడట కూడా. వీటికి సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఎకౌంట్లలో చూడొచ్చు. ఐతే తినడం వరకూ సరే! మరి తిన్నదంతా ఎలా అరిగించుకుంటాడనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. అతని సమాధానం ఏమిటో తెలుసా.. కాంపిటీషన్లో పాల్గొనడానికి ముందు, తిన్న తర్వాత భారీ స్థాయిలో వర్క్ఔట్స్ చేస్తానని చాలా తేలిగ్గా చెప్పేస్తున్నాడండీ..! మరి మీరేమంటారు.. చదవండి: వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!! -
ఈటింగ్ కాంటెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థిని మృతి
ఈటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న ఓ విద్యార్థిని మృతిచెందిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. గెలవాలనే తొందరలో ఆహారం గొంతులో ఇరక్కుపోయి, ఊపిరాడక అర్థాంతరంగా తనువుచాలింది. అసలేంజరిగిందంటే.. అమెరికాలో టఫ్ట్స్ యూనివర్సిటీ గతవారం హాట్ డగ్స్ ఈటింగ్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ కాంపిటీషన్లో అదే యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చదువుతున్న మడ్లిన్ అనే 20 ఏళ్ల విద్యార్థిని కూడా పాల్గొంది. ఐతే హఠాత్తుగా హాట్ డగ్ గొంతులో ఇరుక్కుపోవడంతో, ఊపిరిఆడక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్వహణ బృందం హుటాహుటిన బోస్టన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు ఎంతప్రయత్నించినా ఆమె ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. సంఘటన జరిగిన తర్వాత రోజు ఆమె మరణించిందని వైద్యులు మీడియాకు వెల్లడించారు. నిజానికి ఆమె ఒక గొప్ప అథ్లెట్ కూడా. ఈ విషాద సంఘటన తాజాగా వెలుగుచూసింది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
హలీం, పలావ్ ఈటింగ్ పోటీ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని సోడాబాటిల్ ఓపెనర్ వాలా రెస్టరెంట్లో సోమవారం హలీమ్ – పలావ్ ఈటింగ్ పోటీలు నిర్వహించారు. ప్రత్యేక రంజాన్ మెనూతో ఏర్పాటు చేసిన ఈటింగ్ పోటీల్లో పెద్దసంఖ్యలో ఆశావాహులు పాల్గొన్నారు. 1.2 కేజీల హలీమ్ లాగించి భరత్ విజేతగా నిలవగా బాసిత్ అలీ రన్నరప్‌గా నిలిచాడు. 2.5 కేజీల పలావ్ ఆరగించి సౌమ్య ప్రకాష్ విజేతగా నిలవగా 1.5 కేజీల పలావ్ తిని అమిత్నాయర్ రన్నరప్‌గా నిలిచాడు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. గత రెండేళ్ల నుంచి ఈటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు సోడాబాటిల్ ఓపెనర్ వాలా రెస్టరెంట్ నిర్వాహకులు తెలిపారు. పోటీలో పాల్గొన్న ఆశావహులు -
నిజంగా పరోటా సూరినే..!
42 పరోటాలు తిని రూ.5001 బహుమతి కైవసం తిరువొత్తియూరు: మీరైతే సాధారణంగా ఎన్ని పరోటాలు తినగలరు. మహా ఐతే ఓ అయిదారు. అంతకంటే ఎక్కువ తినాలంటే కష్టమే. అయితే నెల్లై జిల్లాలో ఓ యువకుడు ఏకంగా 42 పరోటాలు తిని రూ.5001 నగదును బహుమతిగా పొందాడు. వెన్నెలా కబడి కుళు చిత్రంలో నటుడు సూరి పరోటా తిన్న దృశ్యం ఎప్పుడు చూసినా మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ ఒక్క దృశ్యంతో నటుడు సూరి, పరోటా సూరిగా మారిపోయాడు. తమిళనాటలో పరోటాకు ప్రాధాన్యత ఎక్కువే. ఇదే తరహాలో పరోటా ప్రియులను ఆకర్షించేందుకు నెల్లై జిల్లా కల్లిడై కురిచ్చిలోని ఓ హోటల్లో వింత పోటీ నిర్వహించారు. నమ్మ ఊరు పరోటా సూరి యార్?(మన ఊరి పరోటా సూరి ఎవరు?) అనేది పోటీ పేరు. అందరికంటే ఎక్కువ పరోటాలు తిన్న వారికి రూ.5001 నగదు బహుమతి అందజేయనున్నట్టు హోటల్ యజమాని ప్రకటించాడు. దీనిపై ఆ ప్రాంతంలో పోస్టర్లు అతికించారు. దీన్ని సెల్ఫోన్లో ఫొటోలు తీసిన కొందరు తమ స్నేహితులకు వాట్సాప్‌లో పంపడంతో ఈ పోటీకి మంచి ప్రచారం వచ్చింది. ఈ పోటీ మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగింది. పలు గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడికి చేరుకుని పోటీ పడి మరి పరోటాలు లాగించారు. అయితే పదికి మించి ఎవరూ తినలేకపోయారు. శివగంగైకు చెందిన కాదర్ మైదీన్ అనే యువకుడు ఏకంగా 42 పరోటాలను లాగించి ‘పరోటా సూరి’గా పేరుపొందాడు. దీంతో హోటల్ యజమాని ప్రకటనలో తెలిపిన విధంగా అతనికి నగదును బహుమతిగా అందజేశాడు.