కైలీ గిబ్సన్
ఫుడ్ ఛాలెంజ్‌లో పాల్గొని విజయాలు సాధించినవారు కొందరైతే, మరికొందరేమో దీనిని చాలా సీరియస్‌గా తీసుకుని, గెలవాలనే తాపత్రయంలో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. సాధారణంగా ఎవరైనా ఒకటి లేదా రెండు బర్గర్లు తినగానే ఇక మావల్లకాదని చేతులెత్తేస్తారు! అలా కాదని బలవంతంగా ఎక్కిస్తే ఇక వాంతులే.. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి కేవలం 24 నిముషాల్లో ఎన్ని బర్గర్లు తిన్నాడో తెలిస్తే... ఖచ్చితంగా నోరెల్లబెడతారు.
ఇంగ్లాండ్‌కు చెందిన కైలీ గిబ్సన్ (23) అనే వ్యక్తి ‘మెక్‌డోనల్డ్స్ క్రిస్టమస్ ఛాలెంజ్'లో పాల్గొని కేవలం 24 నిముషాల్లో ఏకంగా 6 బర్గర్లు లాగించేశాడు. పైగా ఇదంతా నాకు చాలా మామూలు విషయమని అంటున్నాడు కూడా. నిజానికి కైలీ గిబ్సన్ ప్రొఫెషనల్ ఈటర్. గత కొన్ని యేళ్లగా ప్రతిరోజూ లెక్కలేనన్ని లార్జ్ మీల్ ఈటింగ్ కాంపిటీషన్లలో పాల్గొంటున్నాడట కూడా. వీటికి సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఎకౌంట్లలో చూడొచ్చు.
ఐతే తినడం వరకూ సరే! మరి తిన్నదంతా ఎలా అరిగించుకుంటాడనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. అతని సమాధానం ఏమిటో తెలుసా.. కాంపిటీషన్‌లో పాల్గొనడానికి ముందు, తిన్న తర్వాత భారీ స్థాయిలో వర్క్‌ఔట్స్ చేస్తానని చాలా తేలిగ్గా చెప్పేస్తున్నాడండీ..! మరి మీరేమంటారు..
చదవండి: వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!!
Comments
Please login to add a commentAdd a comment