బెడిసికొట్టిన రసగుల్లా బిర్యానీ; నెటిజన్ల ఫైర్‌ | Viral Video: Rosogolla Biryani Leaves Internet Angry | Sakshi
Sakshi News home page

రసగుల్లా బిర్యానీ; దయచేసి మళ్లీ చేయొద్దు!

Published Fri, Oct 9 2020 3:33 PM | Last Updated on Fri, Oct 9 2020 3:52 PM

Viral Video: Rosogolla Biryani Leaves Internet Angry - Sakshi

కొత్త కొత్త వంటకాల ప్రయోగం చేయాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. విభిన్న రకాల ఐటమ్స్‌ను కలిపి నూతన వంటకాన్ని కనుగొని అందరితో షేర్‌ చేయాలని అనుకుంటారు. కానీ అన్నిసార్లు అనుకున్నట్లు కుదరవు. కొన్ని అద్భుతంగా రుచికరమైనవిగా వస్తే మరి కొన్ని ఊహించని విధంగా బెడిసి కొడతాయి. ఇలా సోషల్‌ మీడియాలో నెటిజన్ల కోపానికి గురైన ప్రయోగాలు అనేకమున్నాయి. స్వీటీ మ్యాగీ, గులాబ్‌ జామున్‌కీ సబ్జీ, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌ డిప్ప్‌డ్‌ ఇన్‌ చాకొలెట్‌ సాస్‌, మసాలా ఛాయ్‌ విత్‌ ఐస్‌ క్రీం. ఇవ్వన్నీ కూడా గతంలో నెట్టింట్లో అట్టర్‌ ప్లాప్‌ అయిన వంటకాలు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో వంటకం చేరింది. అదే అంగూరి రసగుల్లా బిర్యానీ. చదవండి: సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో

మాడ్లీ ఫుడ్ లవర్ అనే ఫేస్‌బుక్ పేజీ ‘అంగూరి రసగుల్లా బిర్యానీ’ వీడియోను పోస్టు చేసింది. నమ్మకపోతే బిర్యానీ నుంచి రాస్‌గుల్లాను కూడా ఈ వీడియోలో చూపిస్తోంది. ‘ఇది రసగుల్లా బిర్యానీ. మీరు నమ్మడం లేదా. ఇప్పుడే హరా భారా కేబాబ్, ఆలూ చాప్ మరియు దహి కా చట్నీ, ఫిర్నిలతో పాటు అంగూరి రసగుల్లా బిర్యానీని తిన్నాను. అంటూ పోస్టు చేశారు. అక్టోబర్‌ 4న షేర్‌చేసిన ఈ వీడియో నెటిజన్లను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ వంటకం గురించి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అసలు ఇలాంటి వంటకం ఉంటుందని ఊహించలేదని, దయచేసి మరోసారి ఈ వంటకాన్ని చేయొద్దని వేడుకుంటున్నారు. మరొకరు ‘ముందుగా కోవిడ్‌.. ఇప్పుడు ఈ వంట.. 2020 నిజంగా వేస్ట్‌’ అంటూ విమర్శిస్తున్నారు. మరి ఈ వంటకాన్ని ట్రై చేయడానికి  మీకు ధైర్యం ఉందా!. చదవండి: గోబీ  మంచూరియా లాగిద్దామా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement