విభిన్న సంస్కృతుల సమ్మేళనం ‘హైదరాబాద్’లో ఒక్కో గల్లీ ఒక్కో ప్రత్యేకత సంతరించుకున్న విషయం విదితమే. ముఖ్యంగా ఆనాటి నుంచి విభిన్న రుచులకు సైతం భాగ్యనగరం కేంద్రంగా కొనసాగుతోంది. స్థానిక ఆహార వంటకాలు మొదలు విదేశాల కాంటినెంటల్ రుచుల వరకు మన నగరం విరాజిల్లోతోంది. ఈ ఆనవాయితీలో భాగంగానే ఈ మధ్య ‘దొన్నె బిర్యానీ’ సైతం నగరానికి చేరుకుంది.
విశ్వవ్యాప్తమైన హైదరాబాద్ బిర్యానీ గురించి అందరికీ తెలుసు.. కానీ.. దొన్నె బిర్యానీ ఏంటనే కదా..?! ఇది కూడా దక్షిణాది ప్రత్యేక వంటకమే. కర్ణాటక, ప్రధానంగా బెంగళూరులో ఈ డిష్ వెరీ స్పెషల్. కొంత కాలంగా దొన్నె బిర్యానీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది. అయితే బెంగళూరులో 90 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న శివాజీ మిలటరీ హోటల్ నగరంలోని మాదాపూర్‌కు విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో మరో కొత్త రుచి చేరిపోయిందని ఆహారప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాది రుచులకు ఆదరణ..
బెంగళూరులోని ప్రముఖ శివాజీ మిలిటరీ హోటల్, నోరూరించే మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. వందేళ్ల క్లబ్‌లో చేరబోతున్న ఈ ప్రముఖ భారతీయ హోటల్ మొదటిసారి మరో నగరంలో ఆవిష్కృతం అవడం, అది కూడా హైదరాబాద్‌ను ఎంచుకోవడంతో ఇక్కడి వైవిధ్యాన్ని మరింత పెంచుతోంది. కన్నడ వంటకాలు నగరంలో ఇది మొదటిసారి ఏమీ కాదు.. ఎస్‌ఆర్‌నగర్, మాదాపూర్, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లో కన్నడ రుచులు ఇప్పటికే లభ్యమవుతున్నా.. పూర్తిస్థాయిలో అక్కడి రుచులకు ఆదరణ లభిస్తోందనడానికి ఇదో నిదర్శనం.
దొన్నె బిర్యానీ, మటన్ ఫ్రై వంటి పలు వంటకాలకు ప్రసిద్ధి చెందిన శివాజీ హోటల్ హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో తమ సేవలను విస్తరించింది. 1935 నుంచి దక్షిణాదిలో తన ప్రత్యేకత పెంచుకున్న శివాజీ మిలిటరీ హోటల్ నగరవాసులకూ చేరువైంది. స్పైసీగా ఉండే మన హైదరాబాదీ బిర్యానీకి దొన్నె బిర్యానీ కాస్త బిన్నంగా ఉన్నప్పటికీ.. భౌగోళిక సమ్మేళనంలో భాగంగా ఇప్పటికే తెలుగు వారు సైతం ఈ బిర్యానీని రుచి చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment