జైల్ మండి రెస్టారెంట్‌లో లోపలి అరేంజ్‌మెంట్స్
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. మండి బిర్యానీ ఆరగించేందుకు బిర్యానీ ప్రియులు అమితంగా ఇష్టపడుతుంటారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మండి బిర్యానీకి ప్రత్యేకంగా పలు రెస్టారెంట్‌లు వెలిశాయి. అయితే వినూత్న రీతిలో పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ‘ది న్యూ జైల్ మండి’ బిర్యానీ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. రొటీన్‌కు భిన్నంగా జైల్ సెట్టింగ్‌లతో ఏర్పాటు చేసిన మండి రెస్టారెంట్ ఆకట్టుకుంటోంది. రెస్టారెంట్‌లో పూర్తిగా జైలు వాతావరణం ఉంటుంది. లోపలకి వెళితే జైల్‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది. సాధారణంగా మండి బిర్యానీ రుచే వేరు. సౌదీ అరేబియాలో ఒక రకమైన బిర్యానీ ఇది. కారం పసుపు వాడకుండా 18 రకాల మసాల దినుసులతో వండుతారు. మండి బిర్యానీలో చికెన్ ఫ్రైడ్, క్రిస్పీ ఫ్రైడ్, చికెన్ జ్యూసీ, లాలీపాప్, మటన్ మండి, ఫిష్ మండి, ఫ్రాన్స్ మండి ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జైల్ మండిలో అందుబాటులో ఉన్నాయి.
వినూత్నంగా ఏర్పాటు చేశాం
మండీ బిర్యానీకి ఆదరణ బాగా ఉంది. రుచికరంగా ఉండడం వల్ల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. చూడడానికి జైల్ నిర్మాణం కలిగి ఉండడం మా రెస్టారెంట్ ప్రత్యేకత. జైల్ మాదిరిగా సెల్‌లను ఏర్పాటు చేశాము. మొత్తం 7 సెల్‌లు ఉన్నాయి. ఫ్యామిలీ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాము. – ఎ.దర్శన్, నిర్వాహకుడు
ప్రత్యేక అనుభూతి
జైల్ రూపంలో ఉండడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. జైలులో కూర్చుని తిన్న ఫీలింగ్ మాకు కలుగుతుంది. స్నేహితులందరం కలిసి వారానికి రెండు నుంచి మూడు సార్లు వస్తుంటాము. రెస్టారెంట్ వినూత్నంగా ఉండడమే కాదు ఇక్కడ మండీ బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది. ఫ్యామిలీ కూర్చోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
– గణేష్, హిమగిరి కాలనీ, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment