
రికార్డు స్థాయిలో సభలు పెట్టాం
నల్లగొండ : ఉద్యమ పార్టీగా రికార్డు స్థాయిలో సభలు పెట్టామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం ఆదివారం నల్లగొండలో నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్ల పండుగ ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహిస్తున్నామని.. ఆ సభను విజయవంతం చేసేందుకు వెల్లువలా వచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు లాంటి నాయకులు టీఆర్‌ఎస్ ఉండదు మధ్యలోనే బంద్ అవుతుందని చెప్పారని.. కానీ, ఎన్నో మైలురాళ్లు, అవరోధాలను అధిగమించి తెలంగాణను అడ్డుకునే రాక్షసులను తరిమికొట్టామన్నారు. మంత్రి కోమటిరెడ్డి కోతల మంత్రిగా మారాడని.. మంత్రుల చేతకానితనం వల్లే రైతులకు మద్దతు ధర అందడం లేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీలో ప్రమాదం జరిగితే సహాయక చర్యలు చేసి బాధితులను వెలికితీసే దమ్ము, తెలివి కాంగ్రెస్ నాయకులకు లేదని ఎద్దేవా చేశారు. హాస్టళ్లలో కల్తీ నిత్యావసరాలు సరఫరా చేస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని.. ఇందులో మంత్రుల మనుషులే ఉన్నారని ఆరోపించారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, చకిలం అనిల్‌కుమార్, మాలె శరణ్యారెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీను, రవీందర్‌రావు, కరీంపాష, మారగోని భిక్షం, బోనగిరి దేవేందర్, రవీందర్‌రెడ్డి, మారగోని గణేష్, రావుల శ్రీని వాస్‌రెడ్డి, మెరుగు గోపి పాల్గొన్నారు.
ఫ 27న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు జనం వెల్లువలా తరలివస్తారు
ఫ ఎన్నో అవరోధాలను అధిగమించి రాక్షసులను తరిమికొట్టాం
ఫ మాజీ మంత్రి, సూర్యాపేట
ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి