
తమిళసినిమా: చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్‌తో జతకట్టేస్తున్న నటి కృతిశెట్టి. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మంగళరు భామ ఈమె. ఆ చిత్రంతో కృతిశెట్టి దశ మారిపోయింది. ఆ తరువాత తెలుగులో శ్యాంసింగరాయ్, బంగార్రాజు వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించి మరింత పాపులర్ అయ్యింది. అంతేకాకుండా తెలుగులో నటిస్తూనే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో రపొందిన ది వారియర్ చిత్రంలో నటుడు రామ్‌కు జంటగా నటింంది.
తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కింన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, అందులో నటుడు శింబు పాడిన బుల్లెట్ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. అందులో నటించిన కృతిశెట్టికి తమిళంలోనూ క్రేజ్ తెచ్చి పెట్టింది. దీంతో ఇక్కడ వెంట వెంటనే నటుడు సర్య, నాగచైతన్యతో రొమాన్స్ చేసే అవకాశాలను దక్కించుకుంది. బాలా దర్శకత్వంలో సర్య నటిస్తున్న వణంగాన్ చిత్రంలోన, వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలోనూ నటిస్తోంది.
కాగా ఈ అమ్మడు ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటింంది. వారు అడిగిన ప్రశ్నలకు చకచకా బదులిచ్చింది. అలా ఒక అభిమాని నటుడు అజిత్, విజయ్‌ల గురించి ఒక మాటలో చెప్పాలని అడగ్గా అజిత్ జెన్యూన్ పర్శన్ అని విన్నానని, అదేవిధంగా నటుడు విజయ్ ఇన్స్‌పైరింగ్ సపర్‌స్టార్ అని పేర్కొంది. ఇక మహేష్ గురించి తెలుపుతూ.. ఆయన రియల్‌గాను, రీల్‌లోనూ సూపర్‌స్టార్ అని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment