Sreeleela: ఆమె అంటే ఎంతో ఇష్టం | Sreeleela to make her Bollywood debut soon | Sakshi
Sakshi News home page

Sreeleela: ఆమె అంటే ఎంతో ఇష్టం

Jul 2 2024 12:24 PM | Updated on Jul 2 2024 12:31 PM

Sreeleela to make her Bollywood debut soon

పెళ్లి సందడితో టాలీవుడ్‌లో మహా సందడి చేసిన నటి శ్రీలీల. అలా తొలి చిత్రం తర్వాత చిన్న గ్యాప్‌ రావడంతో ఇంక అంతేనా అన్నారు సినీ వర్గాలు. అయితే ఢమాకా చిత్రంలో మాస్‌ డాన్స్‌తో కుమ్మేయడంతో అందరి దృష్టి శ్రీలీలపై పడింది. అంతే అవకాశాలు వరుస పట్టేశాయి. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిపోతున్న ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా తమిళంలో నటుడు అజిత్‌ సరసన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని నిర్మాతలు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదన్నది గమనార్హం. ఇకపోతే ఈ అమ్మడు ఇటీవల చైన్నెలో సందడి చేశారు. 

ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీలీలపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో మీకు నచ్చిన నటి ఎవరన్న ప్రశ్నకు నయనతార అంటే ఎంతో ఇష్టం అని బదులిచ్చారు. అయితే ఒకరనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎందరో ఉన్నారని తెలివిగా బదులు ఇచ్చారు. మొత్తం మీద చాలా తక్కువ కాలంలో శ్రీలీల పాన్‌ ఇండియా నటి స్థాయికి ఎదిగి పోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement