
హీరో అజిత్‌లో రైఫిల్ షూటర్, బైక్ రైడర్ ఉన్నారన్నది తెలిసిందే. రైఫిల్ షూటింగ్‌లో ఇప్పటికే రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. బైక్ రైడర్‌గా ఇప్పటికే ఐరోపా దేశాలు తిరిగొచ్చారు. ప్రస్తుతం నేపాల్, భూటాన్ దేశాలను చుట్టేస్తున్నారు. ఈ ప్రయాణం త్వరలో పూర్తి చేసుకుని చైన్నెకి తిరిగి రానున్నారు. తదుపరి మరోసారి ప్రపంచ పయనానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన మేనేజర్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అజిత్‌కుమార్‌కు బైక్ రైడింగ్ అంటే ప్యాషన్ అన్న విషయం తెలిసిందేనని, ప్రస్తుతం ఆయన భూటాన్, నేపాల్ దేశాల్లో బైక్ రైడింగ్ చేస్తున్నారని తెలిపారు.
ఈ బైక్ రైడింగ్ చాలా ఛాలెంజింగ్‌తో కూడిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అజిత్‌కుమార్ స్వదేశీ పర్యటన చేశారన్నారు. నేపాల్, భూటాన్ దేశాల పర్యటనను ముగించుకుని తదుపరి ప్రపంచ యాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నారని, నవంబర్ నుంచి ఈ టూర్ ఉంటుందని చెప్పారు. కాగా అజిత్ తన తాజా చిత్ర షూటింగ్‌కు సిద్ధం అవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి విడా ముయర్చి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను జూన్ నెల నుంచి ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం.
అయితే ఇందులో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. మొదట్లో త్రిష పేరు వినిపించింది. ఆ తరువాత ఆమె నటించడం లేదనే ప్రచారం జరిగింది. ఈ చిత్రం కోసం అజిత్ 70 రోజులు కాల్‌షీట్స్ కేటాయించినట్లు, ఆలోగా ఆయనకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలంటూ కండిషన్ పెట్టినట్లు ప్రచారంలో ఉంది. మొత్తం మీద నవంబర్ నెలలోగా విడా ముయర్చి చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయడానికి లైకా సంస్థ ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. అజిత్ నటించిన తునివు(తెగింపు) గత పొంగల్‌కు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజా చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
చదవండి: బెడ్‌పై ఒకరు, మైండ్‌లో మరొకరు.. నిహారిక డైలాగ్‌పై ట్రోలింగ్
Comments
Please login to add a commentAdd a comment