ప్రమాదకరమైన స్టంట్స్‌.. అజిత్‌ కారు బోల్తా.. వీడియో వైరల్‌ | Ajith Kumar Accident Video From VidaaMuyarchi Shooting Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Actor Ajith Accident Video: డేరింగ్‌ స్టంట్స్‌.. అజిత్‌ కారు ప్రమాదం వీడియో వైరల్‌

Published Thu, Apr 4 2024 2:10 PM | Last Updated on Thu, Apr 4 2024 2:49 PM

Ajith Kumar Accident Video from VidaaMuyarchi Shooting Goes Viral - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌కు భయమనేదే లేదు. ఎంతటి డేంజరస్‌ స్టంటయినా సరే డూప్‌ లేకుండా చేసేస్తాడు. ఈ క్రమంలో పలుమార్లు గాయపడ్డాడు కూడా! ప్రస్తుతం అతడు విడాముయర్చి అనే సినిమా చేస్తున్నాడు. గతేడాది చివర్లో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. అక్టోబర్‌లో.. అజర్‌బైజాన్‌లో తొలి షెడ్యూల్‌ నిర్వహించారు. ఈ షూటింగ్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కారు ప్రమాదం
ఇందులో అజిత్‌ కుమార్‌ కారును వేగంగా నడుపుకుంటూ వెళ్తున్నాడు. కాసేపటికి ఆ కారును పక్కకు ఆపేందుకు ప్రయత్నించాడు, కానీ అప్పటికే అది అదుపుతప్పి బోర్లా పడింది. అజిత్‌ పక్కన నటుడు అరవ్‌ కూడా ఉన్నాడు. అతడి చేతికి బేడీలు వేసి ఉండటంతో పాటు తనను సీటుకు కట్టేసి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కారు బోర్లా పడ్డాక అరవ్‌ను నువ్వు బాగానే ఉన్నావ్‌ కదా, ఏం కాలేదు కదా.. అని అజిత్‌ అతడి గురించి ఆరా తీశాడు. ఇంతలో సెట్‌లో ఉన్నవాళ్లు పరుగున వెళ్లి ఆ ఇద్దరిని బయటకు తీశారు.

డేరింగ్‌ స్టంట్స్‌
ఏమాత్రం బెదురు లేకుండా ఇలాంటి డేరింగ్‌ స్టంట్స్‌ చేసిన అజిత్‌, అరవ్‌ను అభిమానులు కొనియాడుతున్నారు. సినిమా కోసం ప్రాణాలు పణంగా పెట్టే నీకు సెల్యూట్‌ అని కామెంట్లు చేస్తున్నారు. విడాముయర్చి సినిమాకు మగిళ్‌ తిరమేని దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రియ భవానీ శంకర్‌, సంజయ్‌ దత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

చదవండి: ఆ సీన్‌ చేయనని ఏడ్చేసిన హీరోయిన్‌.. విలన్‌గా అది తప్పదన్న నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement