
తమిళ స్టార్ హీరో అజిత్ కొత్త సినిమా 'విడాముయర్చి'. మగిళ్ తిరమేని దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చాలాకాలం తరువాత త్రిష, అజిత్ మూవీలో నటిస్తుండటం విశేషం. ప్రియా భవానీ శంకర్, సంజయ్ దత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్)
తొలి షెడ్యూల్ అజర్ బైజాన్ దేశంలో చేశారు. అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో మధ్యలో నిలిపేశారు. చిన్న గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ ఆ దేశానికి చెక్కేశారు. తాజాగా హీరో అజిత్.. చైన్నె విమానాశ్రయంలో అభిమానితో దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అజర్ బైజాన్‌లో మిగతా షెడ్యూల్‌కి సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తి చేసుకుని.. కొన్ని రోజుల తర్వాత మూవీ యూనిట్ చెన్నైకి తిరిగొస్తారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment