స్టార్ హీరో ఇంటి గోడని కూల్చేసిన అధికారులు.. అదే కారణమా? | Tamil Actor Ajith House Wall Demolished In Chennai Injambakkam, Know Reason Inside - Sakshi
Sakshi News home page

Ajith House: ఇండస్ట్రీలో టాప్ హీరో.. కానీ అందరితో పాటే!

Published Mon, Oct 23 2023 7:21 PM | Last Updated on Tue, Oct 24 2023 10:49 AM

Tamil Actor Ajith House Demolished - Sakshi

సినిమా హీరోలు అనగానే వాళ్లు దైవంశ సంభూతులు అని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్లు కూడా మనలాంటి మనుషులే. సదరు హీరోలకు అన్నీ రూల్స్ వర్తిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ నిబంధన వల్ల స్టార్ హీరో ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఎవరా హీరో?

(ఇదీ చదవండి: వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్‌చరణ్)

తమిళంలో మీకు తెలిసిన హీరో పేర్లు చెప్పండంటే.. ఇప్పటి జనరేషన్ తెలుగు ప్రేక్షకులు రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్ పేర్లు చెబుతారు. వీళ్లకుఏ మాత్రం తగ్గని క్రేజ్ సొంతం చేసుకున్న వాళ్లలో అజిత్ ఒకడు. కానీ తెలుగులో ఈ హీరోకి చెప్పుకోదగ్గ ఫేమ్ లేదు. ప్రస్తుతం ఇతడు చెన్నైలోని ఇంజంబక్కమ్‌లోని ఓ ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఇంటి గోడనే అధికారులు కూల్చేశారు.

అజిత్ ఇల్లు ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు, వర్షం నీరు వెళ్లడానికి డ్రైనేజీ ఏర్పాటు జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆ ఏరియాలో ఉంటున్న దాదాపు 50 ఇళ్లని అధికారులు కూల్చేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ పనులన్నీ జరుగుతున్నాయి. అయితే అజిత్ ఇంటి మొత్తాన్ని ఏం కూల్చేయలేదు. ప్రహరీ గోడని తొలగించారు. ఇప్పుడీ న్యూస్ అభిమానులని ఒక్కసారిగా కలవరపాటుకి గురిచేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది సంక్రాంతికి 'తెగింపు' సినిమాతో వచ్చిన అజిత్.. ప్రస్తుతం 'విడా మయూర్చి' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement