తమిళసినిమా: నటుడు అజిత్‌తో కలిసి టాలీవుడ్ క్రేజీ నటి నటించనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అలాంటి అవకాశం ఉందని సమాధానం వస్తోంది. కోలీవుడ్‌లో స్టార్ హీరోల్లో అజిత్ ఒకరు. ఈయన ఇటీవల నటించిన చిత్రం తుణివు. మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ఫిలింస్ సంస్థ ని ర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. నటుడు అర్జున్, ఆరవ్, రెజీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా అజర్‌బైజాన్‌లో షూటింగ్‌ను నిర్వహించారు.
తదుపరి సెడ్యూల్ ఎప్పుడు? ఎక్కడ నిర్వహించేది చిత్ర వర్గాలు ఇంకా వెల్లడించలేదు. ఇకపోతే మే నెల 1వ తేదీన నటుడు అజిత్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా విడాముయర్చి చిత్రానికి సంబంధించిన ఏదైనా అప్‌డేట్ వస్తుందనే ఆశాభావంతో అజిత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే వారిని ఖుషీపరచడానికి అజిత్ నటించిన బిల్లా చిత్రం రీరిలీజ్ కానుంది. ప్రస్తుతం అజిత్ బైక్‌లో విదేశాలు చుట్టొస్తున్న పని లో ఉన్నారు. కాగా విడాముయర్చి చిత్రం అజిత్ నటిస్తున్న 62వ చిత్రం అవుతుంది. దీంతో తన 63వ చిత్రానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో తెలు గు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనుంది.
ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వచ్చనున్నారు. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో అజిత్ మూడు గెటప్‌లలో నటిస్తారట. కాగా టాలీవుడ్ క్రేజీ నాయకి శ్రీలీల ఈ చిత్రంలో అజిత్‌కు జంటగా నటించనున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమా ల్లో ప్రచారం వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
శ్రీలీల తెలుగులో రవితేజ, మహేశ్‌బాబు వంటి స్టార్ నటుల సరసన నటించారు. తాజాగా అజిత్ సరసన నటించడం నిజమైతే ఇదే ఈమె తొలి తమిళ చిత్రం అవుతుంది. ఇక పోతే ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించి 2025 పొంగల్‌కు విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment