
హీరో అజిత్ తన 63వ చిత్రానికి పచ్చజెండా ఊపారా? అంటే కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈయన తునివు చిత్రం తరువాత కొత్త చిత్రం చేయడానికి దాదాపు ఏడాది పట్టింది. ప్రస్తుతం నటిస్తున్న విడాముయర్చి చిత్రాన్ని ప్రకటించిన ఆరు నెలల తరువాత ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. అజిత్ 62వ చిత్రం అయిన దీన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షనన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
నటి త్రిష, రెజీనా నాయికలుగా నటిస్తున్న ఇందులో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ చిత్ర షూటింగ్‌ను మూడు నెలల్లో పూర్తి చేయడానికి యూనిట్ సభ్యులు ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. కాగా అజిత్ తన 63వ చిత్రానికి కూడా కమిట్ అయినట్లు తాజా సమాచారం. విడుదలై వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన, ప్రస్తుతం విడుదలై –2 చిత్రాన్ని నిర్మిస్తున్న ఆర్‌ఎస్ ఇన్ఫోటెంట్ సంస్థ అధినేత ఎల్ రెడ్ కుమార్ దీన్ని నిర్మించనున్నట్లు తెలిసింది.
ఇటీవల విశాల్, ఎస్‌జే సూర్య కలిసి నటించిన మార్క్ ఆంటోనీ చిత్రంతో హిట్ కొట్టిన అధిక్ రవిచంద్రన్ అజిత్ 63వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలి యాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
చదవండి: కూతురి వయసున్న వాళ్లతో రొమాన్స్? వాళ్లకే సిగ్గు లేనప్పుడు ఇంక నేను మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment