తమిళ సినిమా: అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం తుణివు. మలయాళ నటి మంజు వారియర్ నాయకి. హెచ్.వినోద్ దర్శకత్వంలో జీ.సినివతో కలిసి బోణీకపూర్ నిర్మించారు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో రపొందిన ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈనెల 11వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. కాగా మంజు వారియర్ కేరళలో తుణివు చిత్రాన్ని విడుదలైన రోజునే థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య తిలకించారట.
ఈ సినిమాను తమిళ ప్రేక్షకుల మధ్య చూడాలని ఆశ పడుతున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాను మొదటిసారిగా కేరళలో ప్రేక్షకుల మధ్య థియేటర్‌లో తుణివు చూసి ఆనందించానని తెలిపారు. ప్రేక్షకులతో కలిసి చూడడం థ్రిల్లింగా ఫీలయ్యానని అంది. అదేవిధంగా తమిళ పేక్షకుల మధ్య చూడాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఈ చిత్రంలో తొలిసారిగా యాక్షన్ హీరోయిన్‌గా నటించినట్లు చెప్పారు. ఇలాంటి చాలెంజింగ్ పాత్రలో నటించడానికి శిక్షణ అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలాంటి పాత్రలో తాను నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని కేరళలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, తుణివు చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ నెల 20వ తేదీ ఆమె చెన్నైకు రానున్నారు. అదే రోజున ఆమె నటించిన మలయాళం చిత్రం ఆయిషా తెరపైకి రానుంది. ఇందులో మంజు వారియర్ నటించిన పాత్ర తుణివు చిత్రంలోని పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందని ఆమె తెలిపారు. కాగా స్వతహాగా భరతనాట్య కళాకారిని అయిన మంజు వారియర్ ఈ నెల 20న చెన్నైలో జరగనున్న సర్య అనే వేడుకలో రాదే శ్యామ్ నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment