ఐదున్నరకు ఏం జరిగింది? | Surya's next with Kabali Ranjith titled As '5:35' | Sakshi
Sakshi News home page

ఐదున్నరకు ఏం జరిగింది?

Published Thu, Jul 28 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

ఐదున్నరకు ఏం జరిగింది?

ఐదున్నరకు ఏం జరిగింది?

 ‘5:35’.. సూర్య నటించనున్న చిత్రం టైటిల్ ఇది. ఈ టైటిల్ వెనక దాగున్న రహస్యం ఏంటి? ఐదు గంటల ముప్పైఐదు నిమిషాలకు ఏం జరిగింది? అనేది చెప్పబోతున్నారా? మరొకటి ఏమైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కొన్ని రోజుల్లో దొరుకుతుంది. రజనీకాంత్‌ని ‘కబాలి’గా చూపించిన దర్శకుడు పా.రంజిత్ ఈ ‘5:35’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సూర్య బాక్సర్‌గా కనిపిస్తారట. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
 
 సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలు కానుంది. సూర్య తమ్ముడు కార్తి, పా.రంజిత్ కలయికలో వచ్చిన ‘మద్రాస్’ ఘనవిజయం సాధించింది. ‘కబాలి’ కథను మొదట విన్నది సూర్యనే. నాకంటే రజనీకాంత్ గారికి ఈ కథ బాగుంటుందని రంజిత్‌ను స్వయంగా సూపర్‌స్టార్ వద్దకు తీసుకువెళ్లి, ఆ సినిమా తెరకెక్కడానికి కారణమయ్యారు. రజనీని చాలా స్టైలిష్‌గా చూపించిన రంజిత్ ఇప్పుడీ ‘5:35’లో సూర్యను ఎలా చూపించబోతున్నారో! ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘సింగం 3’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement