ఈ 'కబాలి' మెరుపులు మీకు తెలుసా? | Rajinikanth Kabali mania spreads, Five mindboggling facts about the movie | Sakshi
Sakshi News home page

ఈ 'కబాలి' మెరుపులు మీకు తెలుసా?

Published Tue, Jul 19 2016 6:18 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

ఈ 'కబాలి' మెరుపులు మీకు తెలుసా?

ఈ 'కబాలి' మెరుపులు మీకు తెలుసా?

దేశం ఇప్పుడు 'ఫీవర్'తో ఊగిపోతోంది. శుక్రవారం 'కబాలి' థియేటర్లలో గ్రాండ్‌గా అడుగుపెట్టబోతుండటంతో సౌతిండియా మొత్తం రజనీ నామస్మరణలో మునిగిపోయింది.

దేశానికి ఇప్పుడు 'కబాలి' 'ఫీవర్' పట్టుకుంది. శుక్రవారం 'కబాలి' థియేటర్లలో గ్రాండ్‌గా అడుగుపెట్టబోతుండటంతో సౌతిండియా మొత్తం రజనీ నామస్మరణలో మునిగిపోయింది. అటు ఉత్తర భారతంలోనూ 'కబాలి'పై భారీ హైప్ క్రియేట్ అయింది. అమెరికాతోపాటు అనేక దేశాల్లోనూ 'కబాలి' 22న వెండితెరపై దర్శనమివ్వబోతున్నది.

సర్వత్రా 'కబాలి' మాయా కమ్ముకున్న వేళ ఈ చిత్ర నిర్మాత థాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజనీ సినిమా రూ. 500 కోట్లకుపైగా వసూలు చేయడం ఖాయమని ప్రకటించి మరింత అంచనాలు రేపారు. మొత్తానికి పెద్దగా ప్రచారం చేయకపోయినా ప్రజల్లోకి భారీ అంచనాలతో వెళుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలివి..

1. 'కబాలి' వందకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. దక్షిణాది సినిమాల వరకు ఇది భారీ బడ్జెట్ అనే చెప్పాలి. కానీ, 'కబాలి' మానియాను చూస్తుంటే.. మొదటి రెండు, మూడు రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్లను దాటే అవకాశముందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. రజనీ  కబాలి.. సల్మాన్ సుల్తాన్‌ను అధిగమించడం ఖాయమని వినిపిస్తోంది. 'కబాలి' ట్రైలర్‌ను రెండున్నర కోట్లమంది వీక్షించారు. ఈ రికార్డును 'సుల్తాన్' టీజర్ అందుకోలేకపోయింది. 'కబాలి' వస్తే సుల్తాన్ వసూళ్లు తగ్గిపోయే అవకాశముంది. అమెరికా, ఫ్రాన్స్, చైనా, జపాన్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో 'కబాలి' విడుదల కానుంది. అమెరికాలో ఏకంగా 400 థియేటర్లలో 'కబాలి' హల్‌చల్ చేయనున్నాడు. రజనీ రాకతో సుల్తాన్ థియేటర్లు తగ్గిపోనున్నాయి.

 
2. టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ 'కబాలి' సంచనాలు సృష్టిస్తున్నాడు. ఈ నెల 15న తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. చెన్నైలోని చాలా థియేటర్లలో ఆదివారం వరకు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. చెన్నైలోని ఎస్పీఐ సినిమా హాల్‌లోని మొత్తం 27తెరల్లోనూ 'కబాలి' సినిమానే ప్రదర్శించనున్నారు. రోజుకు 96 షోలు వేయనున్నారు. అయినా ఈ హాల్‌కు సంబంధించిన అడ్వాన్స్  బుకింగ్ టికెట్లు ఆదివారం వరకు అమ్ముడుపోవడం గమనార్హం.

3. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ ఫైండ్ అస్ ఇండియా.. 'కబాలి' విడుదల రోజున తన ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అదే దారిలో నడుస్తూ బెంగళూరుకు చెందిన ఇన్నోవేటివ్ స్ట్రక్చరల్ సోల్యుషన్స్ కంపెనీ కూడా తన ఉద్యోగులకు లీవ్ ఇచ్చింది. 'కబాలి' సినిమా చూసేందుకు ఉద్యోగులు ఎక్కడ మూకుమ్మడిగా సిక్ లీవులు పెడతారోనన్న భయంతో ఆ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కంపెనీల నిర్ణయం ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. కబాలి లీవ్‌లేటర్ ( #KabaliLeaveLetter) హ్యాష్‌ట్యాగ్‌తో ఇది ట్రెండ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement