
దేవుళ్లకే విస్మయం కలిగితే..!
మనకు ఆశ్చర్యం కలిగినా.. విస్మయం కలిగినా.. ఓ మై గాడ్ (ఓఎంజీ) అంటం. మరీ దేవుళ్లకు విస్మయం కలిగితే..
సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. సినిమా ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ 'కబాలి' మానియా మాత్రం ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. మరో రెండురోజుల్లో ఈ సినిమా విడుదల అవుతుండటంతో ఈ సినిమాకు సంబంధించి అనేక కథనాలు, సోషల్ మీడియాలో అనేక పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమాకు మరింత ఫ్రీ పబ్లిసిటీని ఇవి తెచ్చిపెడుతున్నాయి.
మరోవైపు 'తలైవా' అభిమానులు సోషల్ మీడియాలో తమదైన పంచులు, జోకులతో అభిమానాన్ని చాటుకుంటున్నారు. రజనీ 'కబాలి' వస్తున్న కొన్ని బెస్ట్ జోక్స్ మీకోసం..
మనం ఓ మై గాడ్ అంటాం.. మరీ దేవుళ్లు..!
మనకు ఆశ్చర్యం కలిగినా.. విస్మయం కలిగినా.. ఓ మై గాడ్ (ఓఎంజీ) అంటాం. మరీ దేవుళ్లకు విస్మయం కలిగితే వారు ఏమంటారో తెలుసా? ఓ మై రజనీకాంత్ (ఓఎమ్మార్). 'కబాలి' సినిమా చూసిన తర్వాత అందరూ 'ఓఎంజీ'కు బదులుగా 'ఓఎమ్మార్' అనే అంటారు.
When Gods get surprised they say Oh My #Rajnikanth. After watching #Kabali, they would definitely go #OMR!
— Ravinder Dahiya (@RavinderDahiyaa) July 20, 2016
రజనీ ఇంజెక్షన్ సో పవర్ ఫుల్!
ఎయిర్ఏసియాకు సేవలు మెరుగుపడాలంటే.. ఒక్క రజనీకాంత్ ఇంజెక్షన్ ఇస్తే చాలు సేవలు అమాంతం మెరుగుపడుతాయి.- ఓ నెటిజన్
ఆస్కార్ కన్నా రజనీ గొప్ప
కబాలి సినిమాకిగాను రజనీకాంత్ అవార్డు ఆస్కార్‌కు ప్రకటించడమైనది.
తలైవా తొలిసారి పోజు మార్చారు
'కబాలి' కోసం రజనీకాంత్ తొలిసారి ఎడమకాలిపై కుడికాలు వేసి పోజిచ్చారు..
మీకు సెలవు కావాలా?
సల్మాన్ సినిమా ఈద్‌కు వస్తుంది. షారుఖ్ సినిమా దీపావళికి వస్తుంది. ఆమిర్ ఖాన్ సినిమా క్రిస్మస్కు వస్తుంది. మరీ రజనీకాంత్ సినిమా.. మీకు ఎప్పుడు సెలవు కావాలో చెప్పండి..
#SalmanKhan : Eid#SRK: Diwali#Aamirkhan : Christmas#RAJNIKANTH : Bataao... kab chhutti chahiye !!