కబాలి రీమేక్ లో అమితాబ్..? | Amitabh Bachchan to star in the Hindi remake of Kabali | Sakshi
Sakshi News home page

కబాలి రీమేక్ లో అమితాబ్..?

Published Sun, Jul 24 2016 10:13 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

కబాలి రీమేక్ లో అమితాబ్..?

కబాలి రీమేక్ లో అమితాబ్..?

ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా కబాలి. రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం, రిలీజ్ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రజనీ అభిమానులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నా.. సాధారణ ప్రేక్షకులు మాత్రం నిరాశచెందారు. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం రజనీ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాడు.

అయితే ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. నార్త్లో ప్రయోగాత్మక పాత్రలతో అలరిస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను కబాలి రీమేక్లో నటింప చేయాలని భావిస్తున్నారు. మరి సౌత్ సినిమాగా అలరించలేకపోయినా కబాలి.. నార్త్ ఇండస్ట్రీలో ఆకట్టుకుంటుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement