
రజనీకాంత్ అభిమానుల సంబరాలు
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమ ఆరాధ్య కథానాయకుడు నటించిన సినిమాను తొలిరోజే చూడాలన్న ఉద్దేశంతో అభిమానులు ధియేటర్లకు పోటెత్తారు. సినిమా చూసినవాళ్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా చాలా బాగుందని రజనీ అభిమానులు అంటుంటే అంత గొప్పగా ఏంలేదని మామూలు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. నకిలీ సమీక్షలు రాసేవారు జాగ్రత్తగా ఉండాలని రజనీ అభిమానులు హెచ్చరించడం గమనార్హం.
గొప్ప సినిమా విడుదైన రోజే తొలి ఆట చూడడం అద్భుతమైన అనుభవమని, ఇది సంబరాలు చేసుకోవాల్సిన సమయమని టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా ట్వీట్ చేశాడు.
'కబాలి' చాలా బాగుందని మలేసియాలో సినిమా చూసిన యువ అభిమాని ట్వీట్ చేసింది. రజనీకాంత్ కనిపించినప్పుడల్లా విజిల్స్, కేకలు వేయకుండా ఉండలేకపోయానని తెలిపింది.
ఫ్రాన్స్ గ్రాండ్ ఫిక్స్ ధియేటర్ లో 'కబాలి' సినిమా ప్రదర్శన సందర్భంగా రజనీకాంత్ తెరపై కనిపించిన సందడి ఫొటోను ట్విట్టర్ లో పెట్టాడు. ధియేటర్ లో 2800 మంది ఉన్నారని వెల్లడించాడు.
సమీక్షలతో పనిలేకుండా అందరూ రజనీకాంత్ సినిమా చూడాలని ఓ వీరాభిమాని అన్నాడు. కబాలి' తమను ఎంతో ఆకట్టుకుందని పొంగిపోయాడు.
సినిమా నెమ్మదిగా ఉందని, చాలా సన్నివేశాలు విసుగు పుట్టించాయని రాకేశ్ కుమార్ అనే ప్రేక్షకుడు పేర్కొన్నాడు. రజనీకాంత్ తొలిసారిగా కనిపించే సన్నివేశం బాగుందన్నాడు. సినిమా గొప్పగా ఏంలేదన్నాడు.
'కబాలి' తీవ్ర నిరాశకు గురిచేసిందని, డబ్బులు తిరిగిచ్చేయాలని మరో ప్రేక్షకుడు వాపోయాడు. సంగీతం బాలేదని అన్నాడు.
ఇలాంటి చెత్త సినిమా తీసిన దర్శకుడు పా రంజిత్ ను క్షమించలేమంటూ ఇంకో ప్రేక్షకుడు అసహనం వ్యక్తం చేశాడు. 'కబాలి'ని 'లింగా' సోదరుడిగా పోల్చాడు.
Amazing Movie First Day First Show ! Let the festival begin #thalaivar #kabali #nerrupuda… https://t.co/ATdcPrTb4U
— Suresh Raina (@ImRaina) 21 July 2016
#Watched Kabali in Malaysia
Woohoooo I shouted & screamed like anything.. @superstarrajini is exceptional..
Perum magizhchi @beemji sir