
సూర్యతేజ్, ‘కబాలి’ ఫేమ్ ధన్సిక, సిమ్రాన్, సోని చరిష్టా ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘మేళా’. కిరణ్ శ్రీపురం దర్శకత్వంలో మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో సంతోష్ కుమార్ కొంకా నిర్మిస్తున్నారు. కిరణ్ శ్రీపురం మాట్లాడుతూ– ‘‘2006లో ముంబైలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రమిది. 50–60 శాతం చిత్రీకరణ పూర్తయింది. కథానుగుణంగా ధన్సిక, సూర్యతేజ, సోని చరిష్టా పాత్రలకు రెండు, మూడు వెర్షన్స్ ఉంటాయి. ప్రస్తుతం క్లైమాక్స్ లీడ్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం.
త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘విభిన్నమైన కథ, కథనంతో కూడిన చిత్రమిది. కిరణ్‌గారు సినిమాను పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేస్తున్నారు’’ అన్నారు సంతోష్‌కుమార్. ‘‘నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా ఇది. లవ్, కామెడీ, ఎమోషన్స్ వంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు సాయి ధన్సిక. ‘‘వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో కీలక పాత్రలో కనిపిస్తా’’ అన్నారు రాజా రవీంద్ర. ఈ సమావేశంలో సోని చరిష్టా కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, కెమెరా: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, సహ నిర్మాత: పంతం అరుణరెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment