
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ధన్సిక. తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో సైతం అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటి తెలుగులో వాలు జడ సినిమాతో పాటు తమిళ్‌లో యోగి డా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ధన్సికకు గాయాలయ్యాయి.
బార్‌లో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది రౌడీలు ధన్సిక పైకి బీర్ బాటిళ్లను విసిరే సన్నివేశం షూట్ చేస్తుండగా పగిలిన గాజు ముక్క ఒకటి ధన్సిక కంటి కింది భాగంలో గుచ్చుకుంది. వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు ఆమె దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. ధన్సిక ట్రీట్‌మెంట్ పూర్తి అయిన వెంటనే గాయంతోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment