ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన రజనీ! | Rajinikanth interacts with fans on Diwali | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన రజనీ!

Published Sun, Oct 30 2016 2:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM

ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన రజనీ!

ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన రజనీ!

దీపావళి పండుగ సందర్భంగా తన అభిమానులను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు. రజనీ తాజా సినిమా ‘కబాలి’ చెన్నైలోని రోహిణీ థియేటర్‌లో వందరోజులు ఆడింది. ఈ సినిమా శతదినోత్సవం పూర్తి చేసుకోవడంతో అభిమానులు ఆదివారం థియేటర్‌ వద్ద సంబరాలు నిర్వహించారు. అనంతరం నేరుగా చెన్నైలోని పోయిస్‌ గార్డెన్‌లో ఉన్న రజనీ నివాసానికి వెళ్లారు. రజనీ తన అభిమానుల్ని సాదరంగా ఆహ్వానించడమే కాదు వారితో సరదాగా ముచ్చటించారు కూడా. ఈ సందర్భంగా తన అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవల అమెరికాకు వెళ్లిన రజనీ తాజాగా చెన్నై తిరిగొచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్‌, చిన్న కూతురు సౌందర్య, మనవలతో కలిసి దీపావళీ వేడుక చేసుకున్నారు. అనంతరం తన కోసం వచ్చిన అభిమానులకు ప్రత్యేకంగా సమయం కేటాయించి వారిని ఖుషీ చేశారు. దీంతో ఒకేరోజు డబుల్‌ పండుగ చేసుకున్నట్టు అభిమానులు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ఇక, దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘రోబో-2’ సినిమా యూనిట్‌తో రజనీ త్వరలో జతకలుస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement