టికెట్ దొరకలేదని మలేషియా అభిమాని ఆత్మహత్య | Rajinikanth Fan Suicide Attempt In Malaysia | Sakshi
Sakshi News home page

టికెట్ దొరకలేదని మలేషియా అభిమాని ఆత్మహత్య

Published Sat, Jul 23 2016 12:11 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

టికెట్ దొరకలేదని మలేషియా అభిమాని ఆత్మహత్య - Sakshi

టికెట్ దొరకలేదని మలేషియా అభిమాని ఆత్మహత్య

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా ఖండాంతరాలను దాటుతోంది. ఇప్పటికే జపాన్ మలేషియా దేశాల్లో రజనీకి అక్కడ స్టార్ హీరోల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మలేషియాలో రజనీ మేనియా ఏ స్థాయిలో ఉందో ప్రూవ్ చేసే సంఘటన ఒకటి కబాలి సినిమా రిలీజ్ రోజు జరిగింది. రజనీ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా మలేషియాలో అక్కడి ప్రాంతీయ చిత్రం స్థాయిలో మలాయ్ భాష లో రిలీజ్ అయ్యింది.

సినిమా టికెట్ల కోసం మలేషియన్ అభిమానులు కూడా భారీగా పోటి పడ్డారు. ఈనేపథ్యంలో టికెట్ దొరకని ఓ అభిమాని పది అంతస్థుల బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మలేషియాలోని కేన్ సిసి ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కబాలి సినిమాలో అత్యధిక శాతం షూటింగ్ మలేషియాలోనే జరగటంతో సినిమాపై అక్కడ భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement