కబాలి సిమ్ కార్డులు కూడా..! | Airtel ties up with Rajinikanth Kabali Movie Promotions | Sakshi

కబాలి సిమ్ కార్డులు కూడా..!

Jul 12 2016 2:29 PM | Updated on Sep 4 2017 4:42 AM

కబాలి సిమ్ కార్డులు కూడా..!

కబాలి సిమ్ కార్డులు కూడా..!

ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా రజనీకాంత్ కబాలి. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్గా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టుగా ప్రకటించారు.

ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా రజనీకాంత్ కబాలి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్గా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇమేజ్ను తమ బ్రాండ్ల ప్రమోషన్కు వాడుకోవాలని చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇప్పటికే సినిమాకు అఫీషియల్ బ్రాండ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్న ఎయిర్ ఏషియా కబాలి స్పెషల్ ఫ్లైట్స్ను సిద్దం చేసింది. సినిమా రిలీజ్ రోజు చెన్నైకి ప్రధాన నగరాల నుంచి స్పెషల్ ఫ్లైట్స్ను నడపనుంది. అదే సమయంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా కబాలి ప్రమోషన్లో భాగం పంచుకుంటోంది. అందుకోసం ప్రత్యేకంగా కబాలి సిమ్లను విక్రయించేందుకు రెడీ అవుతోంది.

రిలీజ్కు మరో పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఈ గ్యాప్ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతోంది ఎయిర్టెల్. కబాలి స్పెషల్ సిమ్ తీసుకున్నవారికి వాల్ పేపర్స్, రింగ్ టోన్స్ లాంటివి ఫ్రీగా అందించనుందట. అంతేకాదు ఇప్పటికే ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న కస్టమర్స్ కోసం కబాలి స్పెషల్ రీచార్జ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement