రజనీ ‘కబాలి’ ఫ్యాన్స్‌కు చేదువార్త! | Rajinikanth Kabali might get postponed, likely to release on July 22 | Sakshi
Sakshi News home page

రజనీ ‘కబాలి’ ఫ్యాన్స్‌కు చేదువార్త!

Published Wed, Jun 29 2016 3:48 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

రజనీ ‘కబాలి’ ఫ్యాన్స్‌కు చేదువార్త!

రజనీ ‘కబాలి’ ఫ్యాన్స్‌కు చేదువార్త!

మళ్లీ వాయిదాపడిన సినిమా విడుదల

భారీ అంచనాలు, రికార్డుల మీద రికార్డులతో దూసుకుపోతున్న ‘కబాలి’ సినిమా కోసం రజనీకాంత్‌ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్టే కనిపిస్తోంది. వచ్చే నెల 15న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సంకల్పించింది. అయితే 15న ఈ సినిమా వచ్చే అవకాశం లేదని తాజా సమాచారం అందుతోంది. ఈ సినిమా విడుదలను వచ్చేనెల 15 నుంచి 22కు వాయిదా వేసినట్టు విశ్వసనీయ సమాచారం.

‘కారణాలు ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోయినప్పటీ సినిమా విడుదలను వారంపాటు వాయిదా వేశారు. ఈ సినిమా ఇక జూలై 22న ప్రేక్షకుల ముందుకురానుంది. సెన్సార్ పూర్తికాగానే చిత్ర రూపకర్తలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

‘విక్రమసింహా’, ‘లింగ’ వంటి ఫ్లాపుల తర్వాత పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ ‘‍కబాలి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో వయస్సు మళ్లిన డాన్‌గా రజనీ కనిపిస్తుండగా.. ఆయనతోపాటు రాధికా ఆప్టే, దినేశ్, రిత్వికా, ధన్సిక తదితరులు నటిస్తు‍న్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement