సారీ చెప్పిన కబాలి హీరోయిన్.. | Radhika Apte says it was ‘unfortunate’ she couldn’t promote Kabali | Sakshi
Sakshi News home page

సారీ చెప్పిన కబాలి హీరోయిన్..

Published Fri, Jul 29 2016 3:04 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

సారీ చెప్పిన కబాలి హీరోయిన్..

సారీ చెప్పిన కబాలి హీరోయిన్..

బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుకొడుతున్న కబాలిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసిన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొననందుకు విచారం వ్యక్తం చేసింది. ఇందుకు క్షమాపణలు చెప్పింది. కబాలి ప్రమోషన్కు దూరమవడం దురదృష్టకరమని, మరో సినిమా షూటింగ్లో పాల్గొనాల్సిరావడమే దీనికి కారణమని చెప్పింది.

కబాలి సినిమా విడుదల తేదీని అనుకోకుండా ప్రకటించారని, ఆ సమయంలో తాను వేరే సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నానని రాధిక తెలిపింది. ఈ సినిమా అన్ని రికార్డులు బద్దలుకొడుతోందని, రజనీకాంత్తో నటించే అవకాశం రావడాన్ని గొప్పగా భావిస్తున్నానని చెప్పింది. తాను నటించిన మంచి పాత్రల్లో ఈ సినిమాలోనిది ఒకటంటూ, సినిమా గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా వ్యక్తం చేసింది. కబాలి సినిమాలో రజనీకాంత్ భార్యగా రాధికా, కూతురుగా మరో కీలకపాత్రలో ధన్సిక నటించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా భారీ కలెక్షన్లు సాధిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement