అభిమానులకు కిక్కే కిక్కు | kabali movie music out on june first week and movie release on july 1st | Sakshi
Sakshi News home page

అభిమానులకు కిక్కే కిక్కు

Published Thu, May 19 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

అభిమానులకు కిక్కే కిక్కు

అభిమానులకు కిక్కే కిక్కు

నోట్లో కాస్ట్‌లీ సిగార్ పైప్... సాల్ట్ పెప్పర్ లుక్‌తో రాజసంగా కుర్చీలో కూర్చున్న రజనీకాంత్.. ఇదీ ‘కబాలి’ చిత్రం ఫస్ట్ లుక్. దానికి ఎంతటి స్పందన వచ్చిందో, ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అంతకు రెట్టింపు స్పందన వచ్చింది. రజనీకాంత్, రాధికా ఆప్టే జంటగా పా. రంజిత్ దర్శకత్వంలో వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి యస్.థాను తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

నిర్మాత మాట్లాడుతూ- ‘‘రజనీకాంత్‌తో సినిమా తీయడం నా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నా. టీజర్‌లో రజనీగారి డైలాగులకు అనూహ్య స్పందన వస్తోంది. అంతకంటే గొప్పవి, అభిమానులను కిక్కెక్కించే డైలాగులెన్నో సినిమాలో ఉంటాయి. రజనీ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని రంజిత్ కథ సిద్ధం చేశారు. సంతోష్ నారాయణ్ మంచి పాటలిచ్చారు. జూన్ మొదటివారంలో పాటలను, జులై 1న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. థన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: మురళి, పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంతశ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దేవి-శ్రీదేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement