
‘కబాలికి’ పాలాభిషేకం
శామీర్‌పేట్: శామీర్‌పేట్ మండలంలోని అలియాబాద్ శ్రీక్రిష్ణ సినిమా థియేటర్లో శుక్రవారం విడుదలైన కబాలి సినిమాకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రజనీకాంత్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో హీరో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో థియేటర్ యజమాని నాగేశ్వరరావు, సల్లూరి అనంతం, ఎస్.మహేశ్, రాజు, భిక్షపతి, శ్రీనివాస్, సునీల్‌శంకర్ తదితరులు పాల్గొన్నారు.