‘కబాలి’ కోసం నెలరోజులు కష్టపడ్డాం! | Rajinikanth starrer Kabali airline took over a month to design | Sakshi
Sakshi News home page

‘కబాలి’ కోసం నెలరోజులు కష్టపడ్డాం!

Published Fri, Jul 1 2016 5:19 PM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

‘కబాలి’ కోసం నెలరోజులు కష్టపడ్డాం!

‘కబాలి’ కోసం నెలరోజులు కష్టపడ్డాం!

‘కబాలి’  విమానం కోసం నెల శ్రమించాం

దేశమంతా ‘కబాలి’  ఫీవర్ ఊపేస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ‘కబాలి’ని చూసేందుకు రజనీ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందడిని మరింత పెంచుతూ తాజాగా ఎయిర్ ఆసియా ఇండియా విమానాయాన సంస్థ ఏకంగా ఓ ప్రత్యేక కబాలి విమానాన్ని ముస్తాబు చేసిన సంగతి తెలిసిందే.

రజనీ స్టైల్‌లో స్పెషల్ ‘కబాలి’ లుక్ తో ముస్తాబైన ఈ విమానం శుక్రవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ విమానం బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణె, చండీగఢ్, జైపూర్, గువాహటి, ఇంఫాల్, వైజాగ్, కొచ్చి మీదుగా ప్రయాణించనుంది.

ఓ హీరో  గౌరవార్థం విమానాన్ని ప్రత్యేకంగా ముస్తాబుచేయడం ఆసియాలో ఇదే తొలిసారి అని ఎయిర్ ఆసియా ఇండియా సంస్థ తెలిపింది. ‘కబాలి’ సినిమాకు ఈ సంస్థ అధికారిక ఎయిర్ లైన్ భాగస్వామిగా ఉంది. ఎయిర్ ఆసియా ఇండియా విమానంలో కబాలి సన్నివేశాలు కొన్నింటిని చిత్రీకరించారు కూడా.. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ప్యాసింజర్ విమానాన్ని ‘కబాలి’ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దామని, సినిమా విడుదలైన తర్వాత ఈ విమానం కొనసాగుతుందని, రజనీ గౌరవార్థం, అంతర్జాతీయంగా ఉన్న ఆయన ఫ్యాన్స్‌ కోసం దీనిని కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఎయిర్ బస్ ఏ-320 విమానాన్ని ‘కబాలి’  లుక్‌ తో రీబ్రాండ్ చేయడానికి నెలరోజులు సమయం పట్టిందని, ఓ వ్యక్తి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ’కబాలి’ విమానాన్ని అందంగా తీర్చిదిద్దాడని చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement