కబాలి ఫీవర్
కబాలి ఫీవర్
Published Thu, Jul 21 2016 11:36 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM
విజయవాడ (గుణదల) : ‘కబాలి’ సినిమా వస్తోంది... టికెట్ బుక్ చేసుకోవాలని ఓ కుర్రాడు ఆశగా ‘బుక్ మై షో’ ఓపెన్ చేశాడు... అదీ మూడు రోజుల ముందే... కానీ ఇంకా సినిమా బుకింగ్ ఓపెన్ చేయలేదు. మళ్లీ తర్వాత... లేదు... ముందు రోజు నో టికెట్స్...షాక్ తిన్నాడు... సిటీలో ఏ గల్లీ థియేటర్‌లో వెతికినా నో టికెట్స్... మొదటి రోజు చూడాలనుకున్న అభిమాని ఇంకాస్త త్వరపడాల్సింది.. ఎందుకంటే అది ‘కబాలి రా’.. ఈ సినిమాకు క్రేజ్ ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో మొదలైంది... రిలీజ్ డేట్ ప్రకటించనప్పటి నుంచి ఎవరి స్థాయిలో వారు రికమెండేషన్స్ చేయడం స్టార్ట్ చేశారు.
ఇప్పుడు బెజవాడ, గుంటూరులో కూడా ‘కబాలి’ హడావుడితో హోరెత్తిపోతోంది. థియేటర్లతో సహా మల్టీప్లెక్సుల్లో కూడా ‘కబాలి’ సినిమాను ప్రదర్శిస్తున్నారు. విజయవాడలోని టిక్కిల్ రోడ్డులోని ఓ హోటల్ తన అతిథుల కోసం ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కబాలి టికెట్స్‌కు ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రానికి సంబంధించి ఆన్‌లైన్‌ద్వారా, థియేటర్/ స్క్రీన్ల కౌంటర్‌ల వద్ద ఈ నెల 19 నుంచే బుకింగ్‌లు జరిగాయి. ఆదివారం వరకు ముందుగానే టికెట్లు అమ్ముడయ్యాయి. ఇదే అదనుగా కొందరు టికెట్లను బ్లాక్‌లో రూ.500 నుంచి 1000 వరకు, మల్టీప్లెక్స్ «స్క్రీన్ల టికెట్ అయితే రూ.750 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. బెంజిసర్కిల్ సమీపంలోని ట్రెండ్‌సెట్ మల్టీప్లెక్స్‌లో రెడ్ ఎఫ్‌ఎం రేడియో ఛానల్‌తో కలిసి గురువారం సాయంత్రం ‘కబాలి’ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈవెంట్‌లో పలువురు యువకులు పాల్గొని టికెట్లు సాధించారు. రజనీకాంత్ సై్టల్స్, ఫేమస్ డైలాగ్స్, పాటలు, ఆయన నడక అంశాల్లో పోటీలు నిర్వహించి సుమారు 250 మంది యువకులకు టికెట్లు అందించారు. అదీ కబాలి క్రేజ్.
Advertisement
Advertisement