
కబాలి విడుదలెప్పుడు?
కబాలి ఈ చిత్రం ఇప్పుడు ఒక సంచలనం. ఏ నోట విన్నా కబాలి మాటే. ఒక చోట నలుగురు కలిశారంటే కబాలి చిత్రం విడుదలెప్పుడన్న కుతూహల సంభాషణలే.
కబాలి ఈ చిత్రం ఇప్పుడు ఒక సంచలనం. ఏ నోట విన్నా కబాలి మాటే. ఒక చోట నలుగురు కలిశారంటే కబాలి చిత్రం విడుదలెప్పుడన్న కుతూహల సంభాషణలే. ఇంతగా పరిశ్రమ వర్గాలను,ప్రేక్షకులను ప్రభావం చూపిన చిత్రం ఇప్పటి వరకూ లేదనే చెప్పాలి. కారణం ఒక్కటే. ఆ చిత్ర కథానాయకుడు సూపర్‌స్టార్ రజనీకాంత్. 65 ఏళ్ల ఈ ఎవర్‌గ్రీన్ హీరో, స్టైల్‌కింగ్ దాదాగా నటిస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో ఎంతగానో నెలకొంది. ఇప్పటికే టీజర్ విడుదలై ఆ ఆసక్తిని రెట్టింపు పెంచింది.
చిత్రంలో రజనీకాంత్ 80 ప్రాంత గెటప్‌లను టీజర్‌లో చూపడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోతోంది. కబాలి చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆతృత పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కబాలి చిత్ర విడుదలెప్పుడన్న తాజా వివరాలను చూద్దాం. మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రం కబాలి అన్న విషయం తెలిసిందే.
నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది చిత్రం. మలాయ్ భాషను మాట్లాడుతున్న తొలి తమిళ చిత్రం కబాలినే. ఈ చిత్రం ఈ నెల 15నే విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్ కూడా ఈ తేదీకే విడుదలకు సిద్ధమైంది. మలాయ్ భాషలో అనువాద కార్యక్రమాలు జరిగినప్పుడు రజనీకాంత్ స్టైల్‌కు తగ్గట్టుగా ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పేవారు లేకపోవడం కారణంగా ఆ భాషానువాద కార్యక్రమాలు ఆలస్యం అయ్యామని యూని ట్ వర్గాల వివరణ.
తాజాగా అన్ని కార్యక్రమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. అమెరికాలో ఉన్న సూపర్‌స్టార్ మూడో తేదీన చెన్నైకి తిరిగిరానున్నారని, నాల్గవ తేదీన కబాలి చిత్రాన్ని పూర్తిగా తిలకించనున్నారని సమాచారం. ఇక ఈ నెల ఏడో తేదీన కబాలి చిత్రం సెన్సార్‌కు వెళ్లనుందని, అది పూర్తి కాగానే చిత్రాన్ని ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల ఖాయం అనీ ఈ విషయంలో 90 శాతం మార్పు ఉండదని చిత్ర వర్గాల సమాచారం.