‘కబాలి’ ఒరిజినల్ కలెక్షన్లు తెలిస్తే షాక్‌ తింటారు! | Rajinikanth Kabali day 4 box office collections, movie earns Rs 400 crore | Sakshi
Sakshi News home page

‘కబాలి’ ఒరిజినల్ కలెక్షన్లు తెలిస్తే షాక్‌ తింటారు!

Published Tue, Jul 26 2016 10:31 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

‘కబాలి’ ఒరిజినల్ కలెక్షన్లు తెలిస్తే షాక్‌ తింటారు!

‘కబాలి’ ఒరిజినల్ కలెక్షన్లు తెలిస్తే షాక్‌ తింటారు!

‘కబాలి’ సినిమా కలెక్షన్ల గురించి అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా అసలు వసూళ్ల గురించి చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌ థాను ధ్రువీకృత వివరాలను ఓ జాతీయ వెబ్‌సైట్‌కు తెలిపారు. ఇప్పటివరకు సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్’, ఆమిర్ ఖాన్‌ ‘పీకే’ సినిమా కలెక్షన్ల గురించి తెలిసి విస్మయపోయిన ప్రజలు.. ‘కబాలి’ ఒరిజినల్ వసూళ్ల గురించి తెలిస్తే షాక్ తింటారు.

భారీ అంచనాలతో, రజనీకాంత్ మేనియాతో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఏకంగా రూ. 400 కోట్లు రాబట్టింది. ఈ 400 కోట్లలో రూ. 200 కోట్లు తొలి వీకెండ్ కలెక్షన్లు కాగా.. మిగతా 200 కోట్లు మ్యూజిక్‌ హక్కులు, శాటిలైట్‌ హక్కులు తదితర వాణిజ్య అమ్మకాల ద్వారా దక్కాయి.

నిర్మాత థాను మాట్లాడుతూ.. తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లను ‘కబాలి’ వసూలు చేసిందని తెలిపారు. ఇందులో ఒక్క అమెరికాలోనే రూ. 28 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. అమెరికాలో ప్రజలు చూసిన టాప్‌ టెన్ సినిమాల్లో ‘కబాలి’ చోటు సంపాదించుకుందని వివరించారు. ఇక భారత్‌లో తొలి మూడు రోజుల్లో దాదాపు రూ. 100 కోట్ల వసూళ్లు వచ్చాయని తెలిపారు.

‘నా జీవితంలో ఈ రోజుల్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సినిమా నాకు ఎంతో ఆనందాన్ని మిగిలించింది. గత వందేళ్లలో భారతీయ సినిమాకు చెందిన అన్ని రికార్డులనూ ‘కబాలి’ బద్దలుకొట్టింది’ అని థాను చెప్పారు.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ‘కబాలి’ సినిమా బడ్జెట్ సుమారు రూ. 75 కోట్లు. ఇందులో 50 నుంచి 60  కోట్లు రజనీ రెమ్యూనరేషన్ ఉంటుందని భావిస్తున్నారు. సినిమా మలేషియా నేపథ్యంగా సాగుతోంది. మలేషియాలో షూటింగ్ తీయడానికే పెద్దమొత్తంలో ఖర్చయిందని భావిస్తున్నారు. సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అంతా కొత్తవారు, యువత కావడంతో వారికి పెద్దగా ఖర్చు కాలేదని, సినిమా నిర్మాణానికి చాలా తక్కువమొత్తంలోనే ఖర్చు అయిందని సినీ పండితులు చెప్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ‘కబాలి’ సినిమా కలెక్షన్ల పరంగా అసాధారణ విజయాన్ని సాధించిందని విశ్లేషిస్తున్నారు. ఈ సినిమాకు మొదట నెగిటివ్ రెస్పాన్స్‌ ఆడియెన్స్ నుంచి వచ్చినా.. సినిమాను చూసేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదని సినీ పరిశీలకులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement