కబాలి సెగ ఎన్టీఆర్ను తాకనుందా..? | Jr NTRs Janatha Garage to clash with Rajinikanths Kabali | Sakshi
Sakshi News home page

కబాలి సెగ ఎన్టీఆర్ను తాకనుందా..?

Published Sun, Jul 3 2016 9:35 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

కబాలి సెగ ఎన్టీఆర్ను తాకనుందా..?

కబాలి సెగ ఎన్టీఆర్ను తాకనుందా..?

ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న కబాలి సినిమా రిలీజ్ డేట్పై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో జూలై 15న రిలీజ్...

ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న కబాలి సినిమా రిలీజ్ డేట్పై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో జూలై 15న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించటం లేదు. మరోసారి సూపర్ స్టార్ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.

ఇప్పటికే రజనీ సినిమా కారణంగా చాలా మంది తమ సినిమాల రిలీజ్ డేట్లపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఇబ్బంది ఎన్టీఆర్కు కూడా ఎదురైందన్న టాక్ వినిపిస్తోంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయాల్సి ఉండటంతో కబాలిని మరో నెల పాటు వాయిదా వేసి ఆగస్టు 12 రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే జనతా గ్యారేజ్ను అదే రోజు రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నాడు ఎన్టీఆర్.

కబాలి తమిళ్, తెలుగు, మళయాలం, హిందీతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. జనతా గ్యారేజ్ ను కూడా తెలుగు తో పాటు తమిళ్, మళయాల భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎన్టీఆర్కు థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా కబాలి నిర్మాతలు స్పందించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement