సాక్షి, విజయవాడ: నటుడు రజనీకాంత్ తాము వచ్చిన పనికే పరిమితమై మాట్లాడి ఉంటే బాగుండేదని ఇతర అంశాల పై మాట్లాడి ఆయన అజ్ఞానాన్ని ప్రదర్శించారని సీఆర్ మీడియా అకాడెమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో శుక్రవారం ఒక సమావేశంలో పాల్గొన్న రజనీకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు సమాధానంగా ఆయన పై విధంగా స్పందించారు.
ఐటీ రంగం తొలుత అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ ఆధ్వరంలో బెంగళూరు నగరంలో విస్తరించిందని, అనంతరం చెన్నైలో ఆ రంగం ఊపందుకుందని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే నటుడు రజనీ కాంత్ అజ్ఞానంతో మాట్లాడి ప్రజాగ్రహానికి గురయ్యారన్నారు. ఒకవేళ చంద్రబాబుతో ఏదైనా ప్రత్యేక అవగాహనతో ఉన్నారేమో అనిపిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. తమిళనాడు ప్రజలకు ఇటువంటి బెడద తప్పినందుకు సంతోషంగా ఉండి వుంటుందని కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
చదవండి: రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన లక్ష్మీపార్వతి
Comments
Please login to add a commentAdd a comment