
కబాలి థియేటర్‌లో మంటలు
గుంటూరు జిల్లా దాచేపల్లి అలంకార్ థియేటర్‌లో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి సీట్లతో సహా థియేటర్ పూర్తిగా కాలిపోయింది. థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న కబాలి చిత్రాన్ని మ్యాట్నీ షో చూడటానికి వచ్చిన ప్రేక్షకులు మంటలు ఎగిసిపడటంతో.. భయంతో పరుగులు తీశారు.
ఏసీ నుంచి మంటలు వచ్చినట్లు కొంతమంది ప్రేక్షకులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. ఇటివలే రూ. రెండు కోట్లతో థియేటర్ ఆధునీకరించినట్లు మేనేజర్ తెలిపారు.