![రజనీని కలసిన థాయ్ యువరాణి](/styles/webp/s3/article_images/2017/09/4/51476597429_625x300.jpg.webp?itok=kDXC4X5D)
రజనీని కలసిన థాయ్ యువరాణి
చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలవడానికే ప్రత్యేకంగా థాయ్‌లాండ్ యువరాణి మామ్ లూంగ్ రాజదరశ్రీ జయంకుర శుక్రవారం చెన్నైకి వచ్చారు. రజనీని ఆయన సొంతిట్లో కలసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రజని ‘కబాలి’ సినిమా షూటింగ్ కొంతభాగం థాయ్‌లాండ్‌లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడి షూటింగ్ సజావుగా సాగేందుకు యువరాణి జయంకుర సాయపడ్డారు.
దాదాపుగా అరగంటకు పైగా వీరి ఇరువురి భేటీ జరిగినట్లు సమాచారం. పలు అంశాలను మామ్ లుయాంగ్ రజనీ వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. రజనీకాంత్ను కలిసినందుకు ఈ సందర్భంగా జయంకుర సంతోషం వ్యక్తం చేశారు. తమ దేశంలో రజనీకాంత్కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ సమావేశంపై రజనీకాంత్ కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.