Mom Luang Rajadarasri Jayankura
-
రజనీని కలసిన థాయ్ యువరాణి
చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలవడానికే ప్రత్యేకంగా థాయ్‌లాండ్ యువరాణి మామ్ లూంగ్ రాజదరశ్రీ జయంకుర శుక్రవారం చెన్నైకి వచ్చారు. రజనీని ఆయన సొంతిట్లో కలసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రజని ‘కబాలి’ సినిమా షూటింగ్ కొంతభాగం థాయ్‌లాండ్‌లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడి షూటింగ్ సజావుగా సాగేందుకు యువరాణి జయంకుర సాయపడ్డారు. దాదాపుగా అరగంటకు పైగా వీరి ఇరువురి భేటీ జరిగినట్లు సమాచారం. పలు అంశాలను మామ్ లుయాంగ్ రజనీ వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. రజనీకాంత్‌ను కలిసినందుకు ఈ సందర్భంగా జయంకుర సంతోషం వ్యక్తం చేశారు. తమ దేశంలో రజనీకాంత్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ సమావేశంపై రజనీకాంత్ కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. -
సూపర్‌స్టార్‌ను కలిసిన థాయ్ ప్రధాని
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలవడానికే ప్రత్యేకంగా థాయ్‌లాండ్ నుంచి ఆ దేశ ప్రధాని చెన్నై రావడం విశేషం. రజనీకాంత్ నటించిన కబాలి చిత్రాన్ని థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. ఆ సమయంలో కబాలి చిత్ర షూటింగ్‌కు ఆ దేశ ప్రధాని మామ్లుయంగ్ రాజధర్శ్రీ జయకుమార్ ఎంతగానో సహకరించారట. ఆ చిత్ర షూటింగ్ సమయంలో కలిగిన స్నేహం కారణంగాథాయ్లాండ్ దేశ ప్రధాని శుక్రవారం రజనీకాంత్‌ను కలవడానికి ప్రత్యేకంగా చెన్నై వచ్చారు. రజనీకాంత్‌ను ఆయన స్వగృహంలో కలిసి యోగ క్షేమాలను అడిగి ముచ్చటించారు. థాయ్‌లాండ్‌లో సూపర్‌స్టార్‌కు పెద్ద సంఖ్యలో అభిమానగణం ఉన్నారని ప్రధాని రాజధర్శ్రీ జయకుమార్ పేర్కొన్నారు. థాయ్‌లాండ్ ప్రధాని రజనీకాంత్‌ను కలిసినప్పుడు ఆయనతో పాటు ఎస్.క్రియేషన్స్ సీఈఓ పరంధామన్ థాను కుడా ఉన్నారు.