Thailand Princess
-
‘ప్రధాని’ రేసులో థాయ్ యువరాణి
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి పదవికి జరిగే ఎన్నికల బరిలో ఉంటానని యువరాణి ఉబోల్ రతన ప్రకటించారు. థాయ్ రాజు మహా వజ్రాలంగ్‌కోర్న్ సోదరి అయిన రతన..మాజీ ప్రధాని థక్షిన్ షినవ్రతకు చెందిన థాయ్ రక్ష చార్త్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు తెలిపారు. ‘పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఉబోల్ రతన అభ్యర్థిత్వాన్ని ఖాయం చేశాం’ అని థాయ్ రక్ష చార్త్ పార్టీ నేత ప్రీచాపొల్ పొంగ్పనిచ్ తెలిపారు. 1972లో అమెరికా దేశస్తుడు పీటర్ జెన్సెన్ను వివాహం చేసుకున్న రతన, రాచరిక గౌరవాలను వదులుకున్నారు. ఏకైక కొడుకు మరణం, భర్తతో విడాకులు తర్వాత రాచ కుటుంబ సభ్యురాలిగానే కొనసాగుతున్నారు. గెలుపు తమదే అనే ధీమాతో ఉన్న సైనిక పాలకులకు రతన నిర్ణయం శరాఘాతంగా మారింది. -
రజనీని కలసిన థాయ్ యువరాణి
చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలవడానికే ప్రత్యేకంగా థాయ్‌లాండ్ యువరాణి మామ్ లూంగ్ రాజదరశ్రీ జయంకుర శుక్రవారం చెన్నైకి వచ్చారు. రజనీని ఆయన సొంతిట్లో కలసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రజని ‘కబాలి’ సినిమా షూటింగ్ కొంతభాగం థాయ్‌లాండ్‌లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడి షూటింగ్ సజావుగా సాగేందుకు యువరాణి జయంకుర సాయపడ్డారు. దాదాపుగా అరగంటకు పైగా వీరి ఇరువురి భేటీ జరిగినట్లు సమాచారం. పలు అంశాలను మామ్ లుయాంగ్ రజనీ వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. రజనీకాంత్‌ను కలిసినందుకు ఈ సందర్భంగా జయంకుర సంతోషం వ్యక్తం చేశారు. తమ దేశంలో రజనీకాంత్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ సమావేశంపై రజనీకాంత్ కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.