నేనందుకు అంగీకరించలేదు! | Radhika Apte Comments on South Industry | Sakshi
Sakshi News home page

నేనందుకు అంగీకరించలేదు!

Published Thu, Oct 12 2017 10:26 AM | Last Updated on Thu, Oct 12 2017 10:26 AM

Radhika Apte

సద్దుమణిగిన విషయాన్ని పదే పదే ప్రస్థావిస్తూ తద్వారా ప్రచారం పొందాలని ఆశిస్తున్నట్లుంది నటి రాధిక ఆప్టే. బాలీవుడ్‌ చిత్రాల్లో అర్ధనగ్నంగా నటిస్తూ, ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసి వార్తల్లోకెక్కే ఈ సంచలన నటి. అదేమని ఎవరైనా విమర్శిస్తే, నా శరీరం, నా ఇష్టం అంటూ డేర్‌గా అనేస్తుంది. ఈ జాణ దక్షిణాదిలో నటించింది చాలా తక్కువ చిత్రాలే. తమిళంలో ధోని, తమిళ్‌సెల్వన్, కబాలి చిత్రాల్లో నటించింది. కబాలిలో రజనీకాంత్‌కు భార్యగా నటించడంతో గుర్తింపు బాగానే వచ్చింది. తెలుగులోనూ బాలకృష్ణ సరసన రెండు సినిమాల్లో నటించింది. అయితే ఆ తరువాతే అవకాశాలు రాలేదు.

ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టిసారించిన రాధిక ఆప్టే దక్షిణాది చిత్రపరిశ్రమపై నిందలు వేస్తూ ఫ్రీ పబ్లిసిటీ పొందేప్రయత్నం చేస్తోంది. అవకాశాల కోసం హీరోయిన్లను అడ్జెస్ట్‌ అవ్వాలంటారని నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ లాంటి కొందరు సంచలన వ్యాఖ్య చేశారు. అవి అప్పట్లో ప్రకంపనలు సృష్టించిన మాట నిజమే అయినా, అలాంటి వాతావరణం సద్దుమణిగిన తరువాత నటి రాధిక ఆప్టే మరోసారి అదే వివాదాన్ని తెర మీదకు తెచ్చింది.

దక్షిణాదిలో హీరోయిన్లను పడక గదికి రమ్మన్ని ఒత్తిడి చేసే సంప్రదాయం ఉంది అని కామెంట్ చేసింది.తనకు అలాంటి చేదు అనుభవం ఎదురైందని, ఒక నిర్మాత కథా చర్చలకు పిలిచి పడక గదికి రమ్మని ఒత్తిడి చేశాడని, అయితే తానందుకు తలవంచలేదని పేర్కొంది. అందుకేనేమో తనకు దక్షిణాదిలో అవకాశాలు ఎక్కువగా రావడం లేదని చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement