
బాలీవుడ్ సంచలన నటి రాధికా ఆప్టే మరోమారు వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌పైనే దృష్టిసారిస్తున్న రాధికాఆప్టే సినీ తారలపై లైంగిక ఒత్తిడి ఉన్న మాట నిజమేనని ప్రకటించి వివాదాస్పద నటీమణుల లిస్టులో పడిపోయింది. ఆ తర్వాత దక్షిణాది సినీ ఇండస్ట్రీ పైనా కామెంట్స్ చేసింది. ఇలా ఏదో ఒక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న రాధికా.. తాజాగా మరో కామెంట్ చేసింది. బాలీవుడ్ నటి నేహా దూపియా నిర్వహిస్తున్న టాక్ షో వోగ్ బీఎఫ్‌ఎఫ్‌కు రాధిక అతిథిగా వెళ్లింది.
అక్కడ ఆమె మాట్లాడుతూ తాను నటించిన తొలి దక్షిణాది సినిమాలో ప్రముఖ హీరో చెంప పగలగొట్టానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్‌లో భాగంగా సెట్‌కి వెళ్లిన తొలి రోజే తనతో హీరో అసభ్యంగా ప్రవర్తించాడని, తన పక్కనే కూర్చున్న అతడు.. తన కాలిని అసభ్యంగా రుద్దాడని చెప్పింది. కనీసం పరిచయం కుడా లేని తనతో ఆ హీరో అలా ప్రవర్తించడంతో కోపంతో చెంప చెళ్లుమనిపించానని రాధిక వివరించింది. తెలుగులో బాలకృష్ణతో లెజెండ్, లయన్.. వర్మ రక్తచరిత్ర వంటి సినిమాలతో పాటు తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాతో రాధికా దక్షిణాది వారికి చేరువైంది.
Comments
Please login to add a commentAdd a comment