కబాలి కేసు కొట్టివేత | kabali case Cancellation Madras High Court | Sakshi
Sakshi News home page

కబాలి కేసు కొట్టివేత

Published Wed, Jul 20 2016 2:40 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

కబాలి కేసు కొట్టివేత - Sakshi

కబాలి కేసు కొట్టివేత

తమిళసినిమా: కబాలి చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. చెన్నై సెంబియత్‌కు చెందిన దేవరాజన్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటీషన్‌లో నటుడు రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం ఈ నెల 22న విడుదల కానున్నదని... ఈ చిత్రానికి ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరల కంటే అధికంగా థియేటర్లో అమ్మకాలు జరుపుతున్నారన్నారు.
 
 ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు రూ,10, రూ.50, రూ120 కాగా కబాలి చిత్రానికి పలు థియేటర్లలో రూ. 500లకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల సాధారణ ప్రేక్షకులు బాధింపుకు గురవుతున్నారని.. ఈ విషయమై ప్రభుత్వానికి  ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదనీ తెలిపారు. కాబట్టి కబాలి చిత్ర విడుదలపై నిషేధం విధించాలని పిటిషన్ ద్వారా కోరారు.  ఈ కేసు మంగళవారం న్యాయమూర్తి కృపాకరన్ సమక్షంలో విచారణకు వచ్చింది.
 
  పిటిషన్‌దారుడు దేవరాజన్ కోర్టుకు హాజరై ఎక్కువ ధరలతో టికెట్ల విక్ర యాన్ని అడ్డుకోవాలని కోరారు. ఈ విషయంలో అధికారులు మెతక వైఖరిని అవలంభిస్తున్నార ని...ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు తెలిపారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయమూర్తి కబాలి టికెట్ల విక్రయ వ్యవహారంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టును ఆశ్రయించాలని సూచించారు. దీంతో ఎలాంటి నిషేధాన్ని విధించడం కుదరదని పేర్కొంటూ కేసును కొట్టివేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement