
కబాలి విషయంలో ఫీలవుతున్న రాజమౌళి
బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, కబాలి విషయంలో ఫీలవుతున్నాడట. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ రోజే చూడటం రాజమౌళికి అలవాటు. కుటుంబ సమేతంగా థియేటర్కు వెళ్లి, అభిమానులతో కలిసి సినిమాలు చూస్తాడు జక్కన్న. అయితే కబాలి సినిమాను అలా చూడలేకపోయాడు.
ప్రస్తుతం బాహుబలి 2 సినిమా క్లైమాక్స్ షూటింగ్లో బిజీగా ఉన్న జక్కన్న టీం, కబాలి సినిమా తొలి రోజు చూసే ఛాన్స్ మిస్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్లో ప్రకటించాడు రాజమౌళి. 'షూటింగ్ లో ఉన్న కారణంగా కబాలి తొలిరోజు తొలి ఆట మిస్ అయ్యాను. థియేటర్లో ఉండి ఉంటే ఇప్పటికే నేను కూడా తలైవా మేనియాలో మునిగిపోయే వాన్ని' అంటూ ట్వీట్ చేశాడు.
Missing kabaali FDFS..
— rajamouli ss (@ssrajamouli) 22 July 2016
Stuck in shooting..
How i wish i could be there in the theatre engulfed by thalaiva mania...