
రెడీ ఫర్ యాక్షన్
యస్.. ఐయామ్ రెడీ ఫర్ యాక్షన్ అంటున్నారు రజనీకాంత్. రేపట్నుంచి చెన్నైలో ‘2.0’ తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లోనే రజనీ షూటింగ్‌కి హాజరు కానున్నారు. ‘కబాలి’ షూటింగ్ పూర్తయిన తర్వాత సూపర్‌స్టార్ మళ్లీ మేకప్ వేసుకోవడం ఇదే. అయితే.. ఈ నెలాఖరున లేదా సెప్టెంబర్ మొదటివారంలో రజనీ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. అప్పటివరకూ మిగతా నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి దర్శకుడు శంకర్ ప్లాన్ చేశారట.
ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా డాక్టర్ రిచర్డ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లీకైన అక్షయ్ గెటప్ ఆడియన్స్‌లో ఆసక్తి కలిగిస్తోంది. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న క్రోమ్యాన్‌గా అక్షయ్, రోబోగా రజనీకాంత్ చేసే యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయంటు న్నారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.