
రజనీ మెచ్చిన చిత్రం
సూపర్‌స్టార్ రజనీకాంత్, నటి జయప్రద ఇంతకుముందు కొన్ని చిత్రాల్లో కలిసి నటించాల న్న విషయం తెలిసిందే.
సూపర్‌స్టార్ రజనీకాంత్, నటి జయప్రద ఇంతకుముందు కొన్ని చిత్రాల్లో కలిసి నటించాల న్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ విషయం అటుంచితే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న జయప్రద. ఇప్పుడు తన కొడుకు సిద్ధార్థ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తమిళంలో ఉయిరే ఉయిరే అనే చిత్రాన్ని సొంతంగా నిర్మిస్తున్నారు. అందాల భామ హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు విశాల్ హీరోగా సత్యం చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఉయిరే ఉయిరే చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ ప్రయాణంలో సాగే హీరో హీరోయిన్ల ప్రేమ కథా చిత్రం అని తెలిపారు.
జయప్రద ప్రత్యేక అనుమతి పొంద టం వలనే చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చెన్నై విమానాశ్రయంలో చిత్రీకరించామని తెలిపారు. మరికొన్నింటిని గోవాలో చిత్రీకరించినట్లు చెప్పారు. జయప్రద ఇటీవల చెన్నై వచ్చి రజనీకాంత్‌ను కలిసి ఉయిరే ఉయిరే చిత్ర ప్రచార చిత్రాన్ని చూపించారట. చిత్రం ట్రైలర్ చాలా బాగుందని రజనీ ప్రశంసించడంతోపాటు తన లింగా చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లలో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించడానికి అనుమతించారని దర్శకుడు రాజశేఖర్ వెల్లడించారు. మరో విషయం ఏమిటంటే ఈ ఉయిరే ఉయిరే చిత్రం తెలుగు చిత్రం ఇష్క్‌కు రీమేక్.