నో సెలబ్రేషన్స్! | Rajinikanth Fans cancelled his Grand Birthday Celebrations | Sakshi
Sakshi News home page

నో సెలబ్రేషన్స్!

Published Mon, Dec 7 2015 1:25 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

నో సెలబ్రేషన్స్! - Sakshi

నో సెలబ్రేషన్స్!

ఈ నెల 12 సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు చాలా ప్రత్యేకమై రోజు. ఏడాది మొత్తం ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటారు. వీలైనంత ఘనంగా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. ఈ సెలబ్రేషన్స్ కోసం నెల రోజులు ముందే సన్నాహాలు మొదలుపెట్టేస్తారు. ఇంతకీ ఈ రోజుకి ప్రత్యేకత ఏంటంటే.. రజనీకాంత్ పుట్టినరోజు. ఆయన 65వ పడిలోకి అడుగుపెడతారు. ఈ బర్త్‌డేని ఘనంగా జరపాలనుకున్నారు అభిమానులు.

అయితే, రజనీ సెలబ్రేట్ చేసుకునే మూడ్‌లో లేరు. అసలే రజనీకి సెలబ్రేషన్స్ అంటే ఇష్టం ఉండదు. కుటుంబ సభ్యులు, అభిమానుల కోరికను కాదనలేక నిరాడంబరంగా చేసుకుంటారు. అయితే, ఈసారి అది కూడా వద్దనుకుంటున్నారట. భారీ వర్షాల కారణంగా తమిళనాడు ప్రజల పరిస్థితి దయనీయంగా ఉన్న నేపథ్యంలో పుట్టినరోజు జరుపుకోకూడదని రజనీ నిర్ణయించుకున్నారట. ఇదిలా ఉంటే...
 
‘రోబో’కి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్ ‘రోబో-2’ను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరోగా అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం రూపొందనుంది. రజనీ పుట్టినరోజు నాడు లాంఛనంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరపాలనుకున్నారట. అయితే, ఈ వేడుకకు కూడా వర్షాలు ఆటంకం అయ్యాయి. ఒకవైపు రాష్ట్ర పరిస్థితి బాగా లేకపోవడంతో కొత్త సినిమా ఏం ప్రారంభిస్తామని అనుకున్నారట.

అందుకని ఆ రోజు పూజా కార్యక్రమాలు జరపాలనుకున్న ఆలోచనను విరమించుకున్నారట. అభిమాన నాయకుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకోలేకపోవడం, ‘రోబో-2’ ఆరంభం వాయిదా పడటం అభిమానులను ఒకింత నిరాశపరిచే విషయమే అయినా, దానికి బలమైన కారణం ఉంది కాబట్టి సర్దిచెప్పుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement