2017 దీపావళికి రోబో సీక్వల్ | Rajinikanths Robot 2 to Release in Diwali 2017 | Sakshi
Sakshi News home page

2017 దీపావళికి రోబో సీక్వల్

Published Thu, Aug 25 2016 2:35 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

2017 దీపావళికి రోబో సీక్వల్

2017 దీపావళికి రోబో సీక్వల్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.0. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్తో పాటు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, బ్రిటీష్ బ్యూటి ఎమీజాక్సన్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2017 దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ముందుగా ఈ సినిమాను సమ్మర్లోనే రిలీజ్ చేయాలని భావించినా.. భారీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఆలస్యమవుతోంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్ధాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement