రజనీతో మరోసారి దీపికాపదుకునే | Deepika Padukone to come together with Rajinikanth again | Sakshi
Sakshi News home page

రజనీతో మరోసారి దీపికాపదుకునే

Published Sun, Sep 6 2015 3:47 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

రజనీతో మరోసారి దీపికాపదుకునే - Sakshi

రజనీతో మరోసారి దీపికాపదుకునే

 సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మరోసారి జతకట్టడానికి బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికాపదుకునే రెడీ అవుతున్నట్టు తాజా సమాచారం. స్టార్ దర్శకుడు శంకర్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ల కలయికలో తెరకెక్కిన ఎందిరన్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందులో ఐశ్వర్వారాయ్ నాయికగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా? రాదా? అన్న చర్చ చాలా కాలంగా జరుగుతోంది. మొన్నటి వరకూ అలాంటి ఆలోచన లేదంటూ దాటేస్తూ వచ్చిన దర్శకుడు శంకర్ ఇప్పటికీ ఎందిరన్-2 గురించి పైకి వెల్లడించకపోయినా గుట్టుచప్పుడు కాకుండా ఆ ప్రయత్నానికి రెడీ అయనట్లు చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు తయారైనట్లు తెలిసింది.
 
 ఆ మధ్య ముంబైలో కథా చర్చలు జరిపిన శంకర్ పనిలో పనిగా హీరోయిన్ల ఎంపిక దిశగా దృష్టి సారిస్తున్నారు. ఎందిరన్-2 చిత్రంలో కత్రినా కైఫ్, లేదా దీపికాపడుకునే ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.అయితే ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ స్థానంలో నటి దీపికాపదుకునే వచ్చి చేరినట్లు సమాచారం. ఇటీవల ముంబైలో నటి దీపికను కలిసిన శంకర్ ఆమెకు కథను వివరించి నటించడానికి సమ్మతం పొందినట్లు తెలిసింది. ఇదే కనక నిజం అయితే నటి దీపికాపదుకునే రజనీకాంత్‌తో రెండవ సారి నటించడానికి సిద్ధం అవుతున్నట్లే.
 
  ఇంతకు ముందు ఈ బ్యూటీ యానిమేషన్ 3డీ చిత్రం కోచ్చయడయాన్‌లో సూపర్‌స్టార్‌తో జతకట్టారన్నది గమనార్హం. కాగా ఎందిరన్-2 చిత్రంలో విలన్‌గా నటుడు విక్రమ్ నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే శంకర్ విలన్ పాత్ర కోసం ఇంకొందరు ప్రముఖ నటుల్లో ఒకరిని నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ పట్టికలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్, విశ్వనాయకుడు కమలహాసన్, హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ పేర్లు ఉన్నాయన్నది గమనార్హం. చిత్రం ఈ ఏడాది చివరిలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కబాలీ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ఇదే నెల 17న ప్రారంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement