Dipikapadukune
-
రజనీతో మరోసారి దీపికాపదుకునే
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మరోసారి జతకట్టడానికి బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికాపదుకునే రెడీ అవుతున్నట్టు తాజా సమాచారం. స్టార్ దర్శకుడు శంకర్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ల కలయికలో తెరకెక్కిన ఎందిరన్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందులో ఐశ్వర్వారాయ్ నాయికగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా? రాదా? అన్న చర్చ చాలా కాలంగా జరుగుతోంది. మొన్నటి వరకూ అలాంటి ఆలోచన లేదంటూ దాటేస్తూ వచ్చిన దర్శకుడు శంకర్ ఇప్పటికీ ఎందిరన్-2 గురించి పైకి వెల్లడించకపోయినా గుట్టుచప్పుడు కాకుండా ఆ ప్రయత్నానికి రెడీ అయనట్లు చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు తయారైనట్లు తెలిసింది. ఆ మధ్య ముంబైలో కథా చర్చలు జరిపిన శంకర్ పనిలో పనిగా హీరోయిన్ల ఎంపిక దిశగా దృష్టి సారిస్తున్నారు. ఎందిరన్-2 చిత్రంలో కత్రినా కైఫ్, లేదా దీపికాపడుకునే ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.అయితే ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ స్థానంలో నటి దీపికాపదుకునే వచ్చి చేరినట్లు సమాచారం. ఇటీవల ముంబైలో నటి దీపికను కలిసిన శంకర్ ఆమెకు కథను వివరించి నటించడానికి సమ్మతం పొందినట్లు తెలిసింది. ఇదే కనక నిజం అయితే నటి దీపికాపదుకునే రజనీకాంత్‌తో రెండవ సారి నటించడానికి సిద్ధం అవుతున్నట్లే. ఇంతకు ముందు ఈ బ్యూటీ యానిమేషన్ 3డీ చిత్రం కోచ్చయడయాన్లో సూపర్‌స్టార్‌తో జతకట్టారన్నది గమనార్హం. కాగా ఎందిరన్-2 చిత్రంలో విలన్‌గా నటుడు విక్రమ్ నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే శంకర్ విలన్ పాత్ర కోసం ఇంకొందరు ప్రముఖ నటుల్లో ఒకరిని నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ పట్టికలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, విశ్వనాయకుడు కమలహాసన్, హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ పేర్లు ఉన్నాయన్నది గమనార్హం. చిత్రం ఈ ఏడాది చివరిలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కబాలీ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ఇదే నెల 17న ప్రారంభం కానుంది. -
ఎక్స్‌డీలో కోచ్చడయాన్ ట్రైలర్
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. రజనీ నటించిన కోచ్చడయాన్ చిత్రం ట్రైలర్‌ను వేలాచ్చేరి ఫినిక్స్మాల్లోని ఎక్స్‌డీ థియేటర్లో శుక్రవారం ప్రదర్శించారు. రజనీ, దీపికాపదుకునే హీరో హీరోయిన్లుగా సౌందర్యా రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన కోచ్చడయాన్ చిత్రం ఎప్పుడు విడుదలవుతాందా అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. మూడేళ్ల క్రితం రోబో విడుదల అనంతరం రాణా చిత్రం పూజాకార్యక్రమాల వేడుకలో రజనీ తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యూరు. సుదీర్ఘ విరామం తరువాత సుమారు వందకోట్ల బడ్జెట్‌తో కోచ్చడయాన్ రూపుదిద్దుకుంది. అయితే ఆ సినిమా విడుదలకు ముందే ట్రైలర్ రూపం లో ఎక్స్‌డీ థియేటర్లో ప్రదర్శనకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐ ప్లే సంస్థ డైరక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ, దేశంలోనే తొలి సారిగా ఎక్స్‌డీ థియేటర్లో సినిమా ట్రైలర్ ప్రదర్శన జరుగుతోందన్నారు. త్రీడీ అంటూ మూడు డైమన్షన్లు, ఎక్స్‌డీ అంటే పలు డైమన్షన్లలో ప్రేక్షకులు అనుభూతి పొందవచ్చని తెలి పారు. ఉదాహరణకు సినిమాలో వర్షం పడితే థియేటర్లోని ప్రేక్షకులపై చిరుజల్లు లు పడినట్లు ఉంటుందని తెలిపారు. భారత్‌కు ఇటువంటి థియేటర్లు ఇటీవలే పరిచ యం అయ్యాయని, చెన్నైలో ఇపుడు ప్రారంభించిన ఫినిక్స్‌మాల్ తో పాటూ ఎక్స్‌ప్రెస్ అవెన్యూ, కోయంబత్తూరులో ఎక్స్‌డీ థియేటర్లు ఉన్నట్లు చెప్పారు. త్వరలో లక్నో, జైపూర్లలో నిర్మిస్తున్నామని అన్నారు. కేవలం 40 సీట్ల కెపాసిటీ గల ఇక్కడి ఎక్స్‌డీ థియేటర్లో కోచ్చడయాన్ ప్రదర్శిస్తామని తెలిపారు. సుమారు 15 నుంచి 20 నిమిషాలు నిడివిగల ఈ సినిమాలకు టికెట్ ధర రూ.200గా ఆయన తెలి పారు. మీడియా సమావేశంలో సంస్థ మరో డెరైక్టర్ రాజ్ మోహన్, మీడియావన్ డెరైక్టర్ టిమ్ మోసెస్ పాల్గొన్నారు.